VJ Sunny సౌండ్ పార్టీతో బిగ్‌బాస్ విన్నర్ సన్నీ.. సిల్వర్ స్క్రీన్‌పై రీసౌండ్ ఖాయమేనట!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత వీజే సన్నీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఏటీఎం, అన్‌స్టాపబుల్‌తో తన మార్క్ చాటుకొన్న సన్ని తన మూడో సినిమాను కూడా పూర్తి చేసుకోబోతున్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు జయశంకర్ సమర్పణలో టాలెంటెడ్ రైటర్ సంజయ్ శేరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్‌ను సినీయర్ జర్నలిస్టులు వైజే రాంబాబు, లక్ష్మీనారాయణ చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సినిమాకు సౌండ్ పార్టీ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ కార్యక్రమంలో వీజే సన్నీ, జయశంకర్, ఫృథ్వీ, ప్రియ తదితరులు పాల్గొననారు. ఈ సందర్భంగా
జర్నలిస్ట్ వైజె రాంబాబు మాట్లాడుతూ... మంగళవారం సన్నీ ఏదో పార్టీ పెట్టబోతున్నా అంటూ ఒక వీడియో షేర్ చేసి అందర్నీ షాక్‌కు గురిచేశాడు.కానీ ఈ రోజే తెలిసింది. అది తన సినిమా టైటిల్ సౌండ్ పార్టీ అని. జర్నలిస్ట్‌గా, యాంకర్‌గా, బిగ్ బాస్ విన్నర్‌గా ఒక్కోమెట్టు ఎదుగుతూ హీరోగా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమాతో ఇంకా సౌండ్ చేయాలని కోరుకుంటూ. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

జర్నలిస్ట్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ... జర్నలిస్ట్‌గా మొదలైన సన్నీ కెరీర్ దూసుకెళ్తున్నది. ఈ సినిమాతో తను సిల్వర్ స్క్రీన్‌పై మరింత సౌండ్ చేయాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు అని అన్నారు.
చిత్ర సమర్పకుడు వీ జయశంకర్ మాట్లాడుతూ.. నిర్మాత రవి గారు నేను మంచి మిత్రులం. తను నాతో ఒక సినిమా చేయాలని వచ్చారు. కానీ అప్పటికే నేను మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాను. అందువల్ల నా చిరకాల మిత్రుడైన సంజయ్‌తో సినిమా చేయమన్నాను. అలా ప్రారంభమైందే ఈ సినిమా. ఎలాంటి సమస్యలు, అడ్డంకులు లేకుండా సంజయ్ సినిమా పూర్తి చేశాడు. ప్లాన్ ప్రకారం ఆగస్ట్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్ అని అన్నారు.

సంగీత దర్శకుడు మోహిత్ రెహమానిక్ మాట్లాడుతూ.. సన్ని నాకు మంచి మిత్రుడు. సంజయ్ గారు మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమా చేశారు. పాటలు కూడా బాగా కుదిరాయి.కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకముంది అని అన్నారు.
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ మా మొదటి తెలుగు సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ కథా,కథనాన్ని నమ్మి సినిమాలు తెరకెక్కిస్తున్నది. USA లో ఆంగ్ల చలన చిత్రాలు, మ్యూజిక్ వీడియోలను నిర్మించడంలో మునుపటి అనుభవం ఉంది. దాంతో తెలుగు సినిమా వైపు ఆకర్షించబడ్డాను. అయితే, నేను కేవలం సినిమాల్లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదు. సినిమా నిర్మాణంలో ప్రతి అంశంలోనూ పాలుపంచుకోవాలని అనుకున్నాను.

దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ... సౌండ్ పార్టీ సినిమా ప్రారంభమై గుమ్మడి కాయ కొట్టడం వరకు వచ్చిందంటే అది కేవలం నా మిత్రుడు జయశంకర్ వల్లే. తను లేకుంటే ఈ సినిమా లేదు. మా నిర్మాత రవి గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేయడానికి సహకరించారు. సన్నీతోపాటు చిత్ర యూనిట్ అందరూ సపోర్ట్ చేశారు. ఇదొక ఫుల్ ఫన్ రైడ్ చిత్రం. ఆగస్ట్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.
హీరో వీజె సన్ని మాట్లాడుతూ.. నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ చేసిన వీడియోకు చాలా మంది నుంచి ఫోన్స్ వచ్చాయి. సౌండ్ పార్టీ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా మిత్రుల చేతుల మీదుగా మా సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అమెరికాలో ఉంటూ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా పూర్తి చేయడానికి సహకరించారు. మా దర్శకుడు సంజయ్ ఎక్కడా తడబడకుండా సినిమా తీశాడు. జయశంకర్ అన్నీ తానై సినిమాను నడిపించాడు. కచ్చితంగా సౌండ్ పార్టీ థియేటర్ లో గట్టిగా సౌండ్ చేస్తుందని నమ్ముతున్నా అన్నారు.


Click it and Unblock the Notifications











