పవన్ కల్యాణ్‌తో 3 నెలలు ఉన్నా... ఏపీకి ఆయనే సీఎం: బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్

బిగ్ బాస్ బ్యూటీ అశ్వినీ శ్రీ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 7లో బాగానే హల్ చల్ చేసింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీ తాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. ఆయన నేను ఒకటే అంటూ హాట్ కామెంట్స్ చేసింది. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలి అంటూ ఆశించింది. పవన్ గురించి ఇంకా ఈ బ్యూటీ ఏం చెప్పిందో ఈ స్టోరీలో క్లుప్తంగా తెలుసుకుందాం.

బిగ్ బాస్ షో అనేది చాలా మందికి లైఫ్ ఇస్తుంది. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వారికి మరింత పాపులారిటినీ తీసుకువస్తుంది. తద్వారా వాళ్లు సినిమా అవకాశాలు రావడంతో మరింత పాపులర్ అయిపోతారు. బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. ఇక ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 షో నడిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ షోలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. అందరినీ ఆకట్టుకుంది అశ్విని శ్రీ. అందాలు ఆరబోస్తునే.. తన ఆటతో అలరించింది.

Bigg Boss Telugu 7 Beauty Ashwini Sree Comments on PowerStar Pawan Kalyan News Goes Viral

ఈ బ్యూటీ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. చిన్న పాత్ర అయినా.. పవన్ తో కలిసి నటించే అవకాశం కావడంతో ఒప్పేసుకుంది. ఇక ఆ తర్వాత మహేశ్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనూ రష్మకి అక్క పాత్రలో నటించింది. ఇక రవితేజ సినిమాలో కూడా కనిపించింది. ఇలా చిన్న చిన్న పాత్రలు చేసుకునే అశ్విని శ్రీకి బిగ్ బాస్ అవకాశం రావడంతో అలా షోలోకి ఎంట్రీ అదరగొట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని యాంకర్ అడగ్గా.. ఇది అందరికీ తెలిసిందే. ఈ అశ్వినికి ఎప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారే ఫేవరెట్. ఇక ఓజీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంది.

Bigg Boss Telugu 7 Beauty Ashwini Sree Comments on PowerStar Pawan Kalyan News Goes Viral

అశ్విని శ్రీ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎప్పుడు నా వాడే.. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు దయవల్ల పవన్ కల్యాణ్ సీఎం అయితే.. బాగుండు.. కావాలని కోరుకుంటున్నాను.. అంటూ చెప్పుకువచ్చింది. పవన్ కల్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే.. మీ రియాక్షన్ ఏంటి అని అడగ్గా.. ఆలోచిస్తే కూడా మాటలు రావడం లేదు. ఆయనతో 3నెలలు ట్రావెల్ చేసాను. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో సార్ పక్కన కూర్చొబెట్టుకుని మాట్లాడేవారు అంటూ వెల్లడించింది.

సెట్లో పవన్ కల్యాణ్ గారు తినే డ్రై ఫ్రూట్స్ తినమ్మా అంటూ ఇచ్చే వారు. అంతే కాదు పాటలు పాడించే వారు. డ్యాన్స్ చేయించే వారు. ఆయన చాలా జన్యూన్. నాలాగే ఉంటారు. నేను కూడా ఓపెన్ గా ఉంటాను. అందుకే ఆయన అంటే ఇష్టం అంటూ చెప్పుకువచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మీద అశ్విని శ్రీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X