Shobha Shetty: పెళ్లికి ముందే వరుస గుడ్ న్యూస్‌లు.. గృహప్రవేశం రోజే ఆ తంతు కూడా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొన్న శోభాశెట్టి గురించి, ఆమె అందాలు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. ఫుల్ గా డబ్బులు సంపాదిస్తున్న ఈమె తాజాగా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. తనకు కాబోయే భర్తతో కలిసి గృహ ప్రవేశం చేసిన ఈమె.. అక్కడే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇలా వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈమె తాజాగా మరో తంతును కూడా జరిపించుకుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీకదీపం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న శోభాశెట్టి.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకు కూడా వెళ్లింది. అక్కడ ఉండగానే ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఏకంగా శోభా ప్రియుడు స్టేజీ మీదకు వచ్చి అందరికీ షాకిచ్చాడు. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో నిరుపమ్ తమ్ముడిగా నటించిన ఇతడే.. మోనిత రియల్ లైఫ్ లవర్ అని తెలుసుకుని షాక్ అయ్యారు. అలా మొదటి సారి షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి కూడా వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూ వస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతోంది. ఎక్కడకు వచ్చిన అతడిని వెంట పెట్టుకునే వస్తుంది.

Bigg Boss Telugu 7 Beauty Shobha Shetty Says Another Good New in House Warming Ceremony

అయితే స్టార్ మా పరివారం విత్ స్టార్ వార్స్ షోలో భాగంగా ఓసారి నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. రెండు నెలల క్రితమే మరోసారి కుటుంబ సభ్యుల నడుమ నిశ్చితార్థం చేసుకుంది. ముఖ్యంగా తన ప్రియుడిని తొలిసారి తన సొంతూరికి తీసుకెళ్లింది. బెంగళూరులోని నివాసానికి శోభాశెట్టి, యశ్వంత్ రెడ్డిలు కలిసి వెళ్లి.. ముఖ్యంగా తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. అక్కడే ఎంగేజ్ మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా తాను తన ఇంటి గురించి వీడియోలు చేసింది. హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన ఈ జంట గృహ ప్రవేశం తాజాగా జరిగింది.

అయితే గృహ ప్రవేశానికి సంబధించిన వీడియో ఇంకా శోభాశెట్టి యూట్యూబ్ లో పెట్టలేదు. కానీ తాజాగాఓ వీడియో పోస్ట్ చేసింది. గృహ ప్రవేశం రోజే.. తను, యశ్వంత్ లు మరోసారి నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు చెప్పింది. అయితే తన ఇంటి వద్ద జరిగింది.. నిశ్చితార్థం కాదని.. ఏదో ఫార్మాలిటీ అని చెప్పుకొచ్చింది. కానీ గృహ ప్రవేశం రోజే.. తాము నిశ్చితార్థం చేసుకుంటున్నామన్న శోభా అందుకు కావాల్సిన వస్తువులను కూడా కొనుగోలు చేసింది. ముఖ్యంగా ప్రియుడితో పాటు వెళ్లి గృహ ప్రవేశం పూజకు కావాల్సిన వస్తువులు (దీపపు కుందులు, మంగళ హారతి ప్లేటు, కుంకుమ భరిణిలు) వంటివి కొనుగోలు చేసింది.

అలాగే తనకు, తనకు ప్రియుడికి ఉంగరాలు కూడా కొనుగోలు చేసింది. అలాగే ఎంగేజ్ మెంట్ రోజు వేసుకోవడానికి ఓ గోల్డ్ నెక్లెస్ ను కూడా కొనుక్కుంది. అంతేతాకుండా తన తల్లితో మరోసారి షాపింగ్ వెళ్లిన ఈమె.. యశ్వంత్ కోసం ఓ బ్రేస్ లెట్ కొంది. అయితే తన తల్లిదండ్రులు ఇప్పటి వరకు యశ్వంత్ కోసం ఏమీ కొనలేదని.. అందుకే తొలిసారి బ్రేస్ లెట్ పెట్టాలనుకుని అది కొనుగోలు చేసినట్లు వివరించింది. త్వరలోనే ఈ క్యూట్ కపుల్ పెళ్లి కూడా చేసుకోబోతుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X