తొలిసారి అత్తారింటికి వెళ్లిన శుభశ్రీ: బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరికీ అక్కడే విందు.. పెళ్లి చేసుకోబోతున్నారా?
బిగ్ బాస్ తెలుగు 7 గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆటతీరుతో అందరినీ మెస్మరైజ్ చేసిన వీళ్లు గ్రాండ్ ఫినాలే తర్వాత నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సొంత వారితో ఓ వారం పాటు గడిపి ఆ తర్వాత... హౌస్ లో ఉన్నప్పటి స్నేహితులతో గడిపేందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా తమకు నచ్చిన వారు, క్లోజ్ అయిన వారిని కలుస్తున్న వీళ్లు పల్లవి ప్రశాంత్ కు సపోర్టింగ్ గా కూడా నిలుస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా శుభ శ్రీ రాయగురు తన అత్తారింటికి వెళ్లింది.
అత్తారిల్లు అంటే కాబోయే అత్తారిల్లు. కాబోయే అని కూడా కన్ఫార్మ్ గా చెప్పలేము. కానీ ప్రస్తుతం వీరిద్దరి రిలేషన్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ముఖ్యంగా టేస్టీ తేజనే ఈ విషయాన్ని రివీల్ చేశారు. సుబ్బు తొలిసారి తన అత్తయ్య ఇంటికి వెళ్తుందంటూ తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో చేశారు. అందులోనే తామిద్దరూ కలిసి కారులో వెళ్తుండడం చూపించారు. ఈక్రమంలోనే చాలా జోకులు వేసుకున్నారు. శుభ శ్రీ ప్రేమ గురించి కూడా తీస్తూ.. కాబోయే అత్తారింటికి ఈ పాప మొదటి సారి వెళ్తుందంటూ చెప్పుకొచ్చాడు.

చివరగా ఒకరి ఇంటికి వచ్చారు. అయితే అది ఎవరి ఇల్లు అనేది మాత్రం చెప్పలేదు. అక్కడకు టేస్టీ తేజ, శుభ శ్రీల వచ్చేకంటే ముందే... ప్రియాంక జైన్, ఆమె ప్రియుడు శివ్, ఆమె తల్లి ఫాల్గుణ, తండ్రి కూడా వచ్చేశారు. వాళ్లే సుబ్బు, తేజలకు హాయ్ చెప్పారు. ఇక ఆ తర్వాత నయని పావని, ప్రిన్స్ యావర్, ప్రిన్స్ యావర్ కుటుంబ సభ్యులు వచ్చారు. వీరంతా ఆ ఇంట్లో ఫుల్ హడావుడి చేశారు. అమర్ దీప్, శోభాశెట్టి, శివాజి, పల్లవి ప్రశాంత్ లు, సందీప్ మాస్టర్ మాత్రం ఈ పార్టీకీ రాలేకపోయారు. అయితే అక్కడే ఉన్న గౌతమ్ కృష్ణ ఉండడం, ఆమె తల్లి కూడా కనిపించారు.

అంతా ఓ చోట చేరి ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత.. అద్భుతమైన ఫుడ్ ను ఆస్వాదించారు. అయితే ఆ ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు అది గౌతమ్ కృష్ణ ఇల్లు అని పార్టీ ఇచ్చింది కూడా అతడేనని తెలిసింది. చికెన్, మటన్, ప్రాన్స్.. ఇలా అనేక రకాల వంటలు కూడా చేయించాడు డాక్టర్ బాబు. ముఖ్యంగా యావర్ కోసం అయితే చాలానే చపాతీలు చేయించారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తింటానంటే ఇవ్వని వాళ్లంతా.. గౌతమ్ కృష్ణ ఇంట్లో మాత్రం తిను తిను అంటూ చాలా ఇచ్చారు. అక్కడంటే మాకే తినడానికి లేదు కాబట్టి ఇవ్వలేదు కానీ.. ఇక్కడ మాత్రం ఇచ్చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఆ తర్వాత గౌతమ్ కృష్ణ తల్లి శుభ శ్రీని ప్రేమగా పిలవడం.. ఆమెతో అన్యోన్యంగా ఉండడం కనిపించింది. అంతమంది అక్కడే ఉన్న గౌతమ్ కృష్ణ కూడా శుభశ్రీ పై ప్రత్యేకమైన ప్రేమను కనబరిచాడు. వీళ్లద్దరూ హౌస్ లో ఉండగానే ఒకరినొకరు ఇష్ట పడ్డట్లు అనిపించింది. బయటకు వచ్చాకా గౌతమ్ కృష్ణ తాను ముందుగా శుభశ్రీని కలుస్తానంటూ చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఇదంతా ఛూస్తుంటే వీళ్లద్దరి మధ్య ప్రేమ ఉందని... కానీ దాన్ని బహిర్గతం చేయట్లేదని అనిపిస్తోంది. చూడాలి మరి ముందు ముందు వీళ్లు కలిసే ఉంటారా.. నిజంగానే ప్రేమను బయట పెట్టి పెళ్లి పీటలు ఎక్కుతారా లేదా అనేది.


Click it and Unblock the Notifications











