Bigg Boss 7లో పాల్గొన్న ఆ లేడీ కంటెస్టెంట్లు లెస్బియన్‌లా..అమ్మాయికి మరో అమ్మాయి ప్రపోజల్, నాకోసం మారతావా అంటూ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరి మనసులోని నిలిచిపోయారు చాలా మంది కంటెస్టెంట్లు. అయితే ఈ సారి సీజన్ లో చాలా మంది అమ్మాయిలు పాల్గొన్నప్పటికీ.. టాప్ 6లో మాత్రం ఒకే ఒక అమ్మాయి నిలబడింది. మిగతా వాళ్లు అందరూ అప్పటికే ఎలిమినేట్ అయిపోయారు. అయితే అందులో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ ధామిని, రతికా రోజ్, శుభ శ్రీ, పూజా మూర్తి, నయని పావని, ప్రియాంక జైన్, శోభా శెట్టిలు ఉండగా.. వీరిలో ఇద్దరూ అందరికీ షాకిచ్చారు. ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు మరొకరికి ప్రపోజ్ చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయిలు ఎవరు, వారిద్దరూ లెస్బియన్లా కాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఓవైపు పల్లవి ప్రశాంత్ కేసు నడుస్తుండగా... సంబురాలు చేసుకోవాల్సిన విన్నర్ కేసులు, లాయర్లు, పోలీస్ స్టేషన్లు అంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోంచి మధ్యలోనే వెళ్లిపోయిన వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు తెగ సంబురాలు చేసుకుంటున్నారు. తమకు నచ్చిన వారిని ఇంటికి పిలిపించుకుంటూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అశ్వత్థామ 2.0 గౌతమ్ కృష్ణ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాడు. అందరినీ పిలవగా... ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, నయని పావని, శుభ శ్రీ, టేస్టీ తేజలు వచ్చారు. ఈక్రమంలోనే వీరంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

ఈక్రమంలోనే శుభ శ్రీ, నయని పావనిలు అందరికీ షాకిచ్చారు. శుభ శ్రీ గౌతమ్ బాబును ప్రేమిస్తుందని అంతా అనుకోగా.. నయని పావనికి ప్రపోజ్ చేసి అందరికీ షాకిచ్చింది. టేస్టీ తేజ మాత్రం మీరు తేడానా, లెస్బియన్లా అన్నట్లుగా మాట్లాడాడు. ముఖ్యంగా అక్కడకు వచ్చిన ప్రియాంక జైన్, శివ్ లు ప్రేమగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఇదంతా చూసిన నయని పావని కొత్త కొత్తగా ఉన్నది.. స్వర్గమిక్కడే అన్నది అంటూ పాట పాడింది. పాటు పాడుతూ.. సుబ్బును కౌగిలించుకుంది. ఈక్రమంలోనే దాని దగ్గర ఏముందే స్వర్గం అంటూ టేస్టీ తేజ అడిగాడు.
దీనికి వెంటనే సుబ్బు మాకెవరు ఉన్నారు అంటూ మేము మేమే కదా అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మాకెవరూ లేరు కదా నాకోసం మారావా నువ్వూ అంటూ నయని పావనిని అడుగుతూ సుబ్బు పాట పాడింది. దీనికి అందరూ పడీ పడీ నవ్వారు. అమ్మాయిలు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా.. పర్లేదు మీరిద్దరూ చేస్కోండే అంటూ చెప్పుకొచ్చారు. సుబ్బు ఈ డైలాగ్ కొట్టగానే నయని పావని నోరు మూసుకుని పక్కకు వెళ్లిపోయింది. సుబ్బు మాత్రం ఏమాత్రం సిగ్గు పడకుండా నవ్వుకుంది. అయితే ఇది టేస్టీ తేజ యూట్యూబ్ ఛానెల్ కావడంతో 10 మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయంటూ ప్రియాంక జైన్, సుబ్బులు గట్టిగా అరిచారు.

ప్రోమో వచ్చింది, వ్యూస్ వచ్చాయి.. ఎపిసోడ్ పూర్తి అయిందంటూ చెప్పుకొచ్చారు. దీనికి టేస్టీ తేజ కూడా హమ్మయ్యా 10 నిమిషాలు అయింది ఓ ఎపిసోడ్ అయిపోయిదంటూ కామెంట్లు చేశాడు. ఇంత ఫన్నీగా వీరి కన్వర్సేషన్ సాగగా.. ఇక్కడికి మరికొంత మంది కంటెస్టెంట్లు రాలేకపోయారు. ముఖ్యంగా శోభాశెట్టి, అమర్ దీప్, శివాజిలు ఇక్కడకు రాలేదు. మరోవైపు పల్లవి ప్రశాంత్ కేసుల చుట్టూ తిరుగుతున్నాడు.


Click it and Unblock the Notifications











