Bhagavanth Kesari: భగవంత్ కేసరిలో రతికా రోజ్.. ఏ పాత్ర చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలను చేస్తూ సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాలో నటించారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఓ బిగ్ బాస్ బ్యూటీ కూడా నటించింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ మాస్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.

క్రేజీ కాంబోలో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ రతికా రోజ్ కూడా నటించింది. ఈ విషయం సినిమా చూసే వరకూ రివీల్ కాకపోవడంతో ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అవుతున్నారు. అదే సమయంలో ఆమె ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
'భగవంత్ కేసరి' సినిమాలో రతికా రోజ్ ఓ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేగా కనిపించింది. చాలా సేపు లేకపోయినా ఈ పాత్ర కూడా బాగానే హైలైట్ అయింది. దీంతో గతంలో కంటే ఈ చిత్రంలోని రోల్‌తో ఆమెకు మరింత ఎక్కువ గుర్తింపు లభిస్తోంది. ఆమెను ఇలా చూసిన వాళ్లంతా బిగ్ బాస్ రతిక బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. తెలుగు అమ్మాయి రతికా రోజ్ గతంలో చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇందులో ఆమె నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది. అయితే, ఇప్పుడు మళ్లీ ఆమె షోలోకి రీఎంట్రీ కూడా ఇస్తుంది. దీంతో ఈ సీజన్ మరింత రంజుగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇక, బాలయ్య గత చిత్రాలకు భిన్నంగా రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేశారు.


Click it and Unblock the Notifications











