Bigg Boss Telugu 7 గౌతమ్ కృష్ణ హీరోగా క్రేజీ ప్రాజెక్ట్.. నిర్మాత ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ రంజుగా సాగుతున్నది. అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ షో 50 రోజులు పూర్తి చేసుకొన్నది. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ డాక్టర్ గౌతమ్ కృష్ణ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. అయితే గౌతమ్ నటిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా గురించిన విశేషాలను నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ తన పుట్టిన రోజ సందర్బంగా వెల్లడిస్తూ..
బిగ్‌బాస్ కంటెస్టెంట్ డాక్టర్ గౌతమ్ కృష్ణ నటిస్తున్న మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. ఆయన నటించిన ఆకాశ విధుల్లో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ద్వారా మరింత క్రేజ్ పెరగడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది అని సతీష్ కుమార్ చెప్పారు.

మా బ్యానర్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ లో గౌతమ్ కృష్ణతో రూపొందిస్తున్న మూడో చిత్రం. మా కథకు ఆయన చక్కగా సరిపోయాడు. ఆయన బిగ్‌బాస్ నుంచి వచ్చిన వెంటనే సినిమా ఫినిష్ చేసి వెంటనే రిలీజ్ చేస్తాం. ఓ సాధారణ యువకుడు అసాధారణ వ్యక్తిగా ఎలా మారాడనేది సినిమా కథ. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొని చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రమ్య పసుపులేటి, శ్వేతా అవస్థి హీరోయిన్లుగా నటిస్తున్నారు అని సతీష్ కుమార్ అన్నారు.
నిర్మాత సతీష్ కుమార్ ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై గతంలో బట్టల రామస్వామి బయోపిక్కు అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్‌తో కాఫీ విత్ ఏ కిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూడో చిత్రమిది. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొంటున్నది.

నటీనటులు: డాక్టర్ గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్‌కే మామ, ఆనంద్ చక్రపాణి, భద్రం, పింగ్‌పాంగ్ సూర్య, ల్యాబ్ శరత్ తదితరులు
సినిమాటోగ్రఫి: త్రిలోక్ సిద్దు
మ్యూజిక్: జుడా శాండీ
ఎడిటింగ్:ప్రవీణ్ పూడి
నిర్మాత:సెవెన్ హిల్స్ సతీష్ కుమార్,
దర్శకత్వం: పీ నవీన్ కుమార్


Click it and Unblock the Notifications











