వాడి పెళ్లాంతో డిన్నర్‌ చేశా.. అందుకే కులం టార్గెట్ , హీరో శివాజీ వీడియో వైరల్

వైనాట్ 175 అంటూ బరిలో దిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తాజా ఏపీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు జనం. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని చారిత్రక విజయం సాధించిన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ ఫలితాలో కేడర్ దిగ్భ్రాంతికి గురైంది. రిజల్ట్స్ తర్వాతి నుంచి నేతలు, శ్రేణులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో జగన్ అక్కడికొచ్చి మృతుడి కుటుంబాన్ని ఓదార్చడం, కూటమి ప్రభుత్వ వేధింపులపై ఢిల్లీలో నిరసన దీక్షకు దిగడం తప్పించి చెప్పుకోదగ్గ యాక్టివిటీస్ లేవు.

ఇలాంటి దశలో వైసీపీ సానుభూతిపరుడిగా పేరున్న పంచ్ ప్రభాకర్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. గతంలో భారత సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ నుంచి అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజు వరకు అందరినీ దూషించాడు. దీంతో ఆయనపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదవ్వగా.. న్యాయస్థానాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. పంచ్ ప్రభాకర్‌ను తక్షణం అరెస్ట్ చేయాలని హైకోర్ట్ అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Bigg Boss Telugu Contestant Sivaji reacted on Punch Prabhakar over Caste Remarks here s the details

ఎన్ఆర్ఐగా చెప్పుకుంటున్న పంచ్ ప్రభాకర్ అసలు పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన అమెరికాలోని న్యూజెర్సీలో వెటర్నరీ డాక్టర్‌గా సేవలందిస్తున్నట్లుగా టాక్. వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన ప్రభాకర్.. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని కులాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసేవాడు. అతని వల్ల పార్టీ పరువు పోతుండటంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం స్పందించి ప్రభాకర్‌తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అరెస్ట్ భయంతో పంచ్ ప్రభాకర్ తన ఛానెల్ ఇండియాలో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని చెబుతారు.

కొద్దినెలలుగా సెలైంట్‌గా ఉంటున్న పంచ్ ప్రభాకర్ ఏం అయ్యాడో ఎవరికీ తెలియదు, పైగా ఏపీలో వైసీపీ దారుణ పరాజయం నేపథ్యంలో అందరిలాగే మౌనం దాల్చాడని ప్రచారం జరిగింది. ఇలాంటి దశలో పంచ్ ప్రభాకర్ పేరు మరోసారి తెరమీదకి వచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనిపై ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో సినీనటుడు శివాజీ పాల్గొని పంచ్ ప్రభాకర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యూజెర్సీలో ఆయన భార్యతో కలిసి తాను డిన్నర్‌కు వెళ్లానని అందుకే ఓ సామాజిక వర్గమంటే ప్రభాకర్ రెడ్డికి కోపమని శివాజీ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది.

దీనికి పంచ్ ప్రభాకర్ స్పందిస్తూ , ఓ సామాజికవర్గాన్ని దూషిస్తూ వీడియో రిలీజ్ చేశారు. టీడీపీ నేతలు నిజాలు, ఆధారాలు ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ చింతా ప్రదీప్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, మీ జీవితాలే ఫేక్ అంటూ వ్యాఖ్యానించారు. ఓ కులంలో ఎంత మంది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిని, భార్యను చంపారు అంటూ ప్రభాకర్ ఘాటు విమర్శలు చేశారు. మీకు ఎంతోమంది భార్యలు ఉన్నారని ఆయన ఆరోపిస్తూ తన వీడియోను టీడీపీ, నారా లోకేష్, టీడీపీ స్వాతిరెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతాలకు ట్యాగ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X