Nallamala success meet నల్లమల చిత్రానికి మంచి రెస్పాన్స్.. ఆనందంలో దర్శకుడు రవి చరణ్, భానుశ్రీ

బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ అమిత్‌ తివారీ, భానుశ్రీ, ప్రముఖ నటులు నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా నమో క్రియేషన్స్ పతాకంపై రవిచరణ్ ‌దర్శ‌కత్వంలో ఆర్‌.ఎమ్‌ నిర్మించిన చిత్రం న‌ల్ల‌మ‌ల‌. మార్చి 18 శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో కేక్ కట్ చేసి సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ హొలీ శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల నుండి డిస్ట్రిబ్యూటర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా అద్భుతంగా ఉందని చెపుతున్నారు. ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని సినిమా తియ్యడం జరిగింది.మంచి కంటెంట్ కు మంచి ఆదరణ అంటే ఇదేనేమో అనిపించేలా ఈ రోజు ప్రేక్షకులు నిరూపించారు. సినిమా ఇంత బాగా రావడానికి ముందు మా నిర్మాత నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. నా టెక్నికల్ టీం అంతా చాలా కష్టపడ్డారు..నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నల్లమల సినిమాను ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

 Bigg Boss Telugu fame Bhanu Sri at Nallamala success meet

హీరోయిన్ భానుశ్రీ‌ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో విడుదలైన మా నల్లమల చిత్రం చాలా బాగుందని చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా "ఎమున్నావే.. పిల్లా " సాంగ్ కు ప్రేక్షకులనుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది.ఆ సాంగ్ కంటే కూడా ఈ సినిమా చాలా బ్యూటీఫుల్ ఉంది. విజువల్స్ గాని, మేకింగ్, టేకింగ్ గాని అద్భుతంగా వచ్చాయి. సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మా సినిమా నచ్చుతుంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

 Bigg Boss Telugu fame Bhanu Sri at Nallamala success meet

నటీన‌టులు: అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: RM
సినిమాటోగ్రఫి: వేణు మురళి
సంగీతం, పాటలు: PR
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్: పీవీ రాజు
ఫైట్స్: నబా
స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌
వీఎఫ్ఎక్స్: విజయ్ రాజ్
పీఆర్వో: శ్రీ‌ను-సిద్ధు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X