ఇనయ సుల్తానా బోల్డ్ చూడాలంటే ధైర్యం కావాలా? మదం ఎవ్వరికి తెలుసా?

కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటాయనే విషయం పలు సందర్భాల్లో స్పష్టమైంది. హారర్, థ్రిల్లర్ జోనర్స్‌లో వచ్చిన చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకొన్నాయి.

కథ, కథనాలు, విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తే ప్రేక్షకులు భారీ విజయాలు అందించిన చరిత్ర టాలీవుడ్‌కు ఉంది. అలాంటి కోవలో వస్తున్న చిత్రమే మదం. మార్చి 14వ తేదీన రాబోతున్న ఈ సినిమా చూడాలంటే ఓ ధైర్యం ఉండాలంటూ చిత్ర యూనిట్ సవాల్ విసిరింది. ఆ సినిమాలో కంటెంట్ ఏమిటి? కాన్సెప్ట్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Madham

అభిరుచి గల నిర్మాతలు ఏకైవ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్న బాబు), రమేష్ బాబు కోయ నిర్మించిన చిత్రం మదం. హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్చి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన టీజర్‌ను తండేల్ సినిమాతో పాటుగా థియేటర్లలో ప్రదర్శించారు.

మా నిర్మాత రమేష్ ఇచ్చిన కథను చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంతటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. తమిళం, మలయాళం భాషల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంటుంది. మదం కథ నాకు చాలా నచ్చింది. ఇలాంటి క్లైమాక్స్‌ ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి అని డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా అన్నారు.

Madham

బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. నాకు నెగెటివ్ పాత్రలు చేయడమంటే ఇష్టం. మదం చిత్రంలో నేను చాలా ఇంపార్టెంట్ కారెక్టర్‌ను చేశాను. మా డైరెక్టర్ వంశీ సినిమాను అద్భుతంగా తీశారు. నా క్లిష్ట పరిస్థితుల్లో వంశీ సపోర్ట్‌గా నిలిచారు. నేను బాగా నటించడానికి ఆయనే కారణం. లత నాకు మంచి స్నేహితురాలు. హర్ష చాలా రియలిస్టిక్‌గా నటించాడు. సినిమా అద్భుతంగా వచ్చింది అని అన్నారు.

More from Filmibeat

Read more about: bigg boss telugu inaya sultana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X