Bholaa Shankar pre release ఇక చచ్చిపోయినా బాధలేదు.. చిరంజీవి దేవుడ్ని చూశా..భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..

మెగాస్టార్ చిరంజీవి, అందాల భామలు కీర్తి సురేష్, తమన్నా భాటియా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 11 తేదీన రిలీజ్ అవుతున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో శ్రీముఖి, హైపర్ ఆది, గెటప్ శ్రీను, యానీ మాస్టర్, లోబో, సురేఖవాణి, రాజ రవీంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు మాట్లాడుతూ..

భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చేసిన యాక్షన్ సీన్లు అద్బుతంగా ఉన్నాయి. తెలుగు సినిమాపై ఇతర భాషలు, సినీ రంగాలు దృష్టిపెట్టాయి. ఈ చిత్రంలో చిరంజీవిని పదేళ్లు తక్కువ వయసున్న యువకుడిలా సినిమాటోగ్రాఫర్ డడ్లీ చూపించారు. వాల్తేరు వీరయ్య కంటే పది రెట్లు ఎక్కువగా భోళా శంకర్ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రకాశ్ అద్బుతమైన సెట్లు వేశారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించిన చిరంజీవి ఇంకా ఫుల్ ఎనర్జీతో సెట్స్‌లో ఉంటారు. మీ జీవితానికి మీరే హీరో. మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసుకోవాలి అని ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అన్నారు.

Bigg Boss Telugu fame Lobo, Surekhavani speeches in Bholaa Shankar pre realease event

కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ మాట్లాడుతూ.. భోళా శంకర్ చిత్రానికి నేను కొరియోగ్రఫి చేయలేదు. ఈ సినిమా ద్వారా తొలిసారి నటించాను. ఈ సినిమాలో నేను కామెడీ క్యారెక్టర్‌లో నటించాను. మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.

కమెడియన్, బిగ్‌బాస్ ఫేమ్ లోబో మాట్లాడుతూ.. లవ్ యూ మెహర్ రమేష్. ఈ సినిమాలో రిలీజ్ తర్వాత నేను చచ్చిపోయినా బాధలేదు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు చిరంజీవి మాట ఇచ్చారు. ఈ సినిమాలో చిన్న పాత్రను పెద్దగా చేశారు. నేను దేవుళ్లను చూడలేదు. కానీ చిరంజీవి దేవుడిని చూశాను. ఇక చచ్చిపోయినా పర్వాలేదు. నా కొడుకు ఎవరైనా మీ నాన్న ఏం చేశాడని అడిగితే.. చిరంజీవి సినిమాలో నటించాడని చెప్పుకొనేంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X