టాలీవుడ్‌కు మరో సీనీ వారసుడు.. బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ పాటతో క్రేజీగా తెరపైన నిర్మాత కొడుకు

తెలుగు సినీ పరిశ్రమకు మరో వారసుడు రాబోతున్నాడు. ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులను పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తన కుమారుడిని సైకో వర్మ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రూపొందుతున్న సైకో వర్మ.. వీడు తేడా అనే టాగ్ లైన్‌తో వస్తున్న సినిమాలో నట్టి క్రాంతి హీరోగా కనిపించబోతున్నారు.

Bigg Boss Telugu fame Rahul Sipligunj song for Natti Krantis Psycho Varma

శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్వీటీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నట్టి కరుణ ,అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నట్టి క్రాంతి, కృష్ణ ప్రియ, సంపూర్ణ మలకర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సైకో వర్మ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సర సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్, నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. సైకో వర్మ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన "పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి" అంటూ సాగే లిరికల్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని తెలిపారు.

సైకో వర్మ మూవీలో నా కుమారుడు నట్టి క్రాంతి హీరోగా పరిచయం అవుతున్నారు. క్రాంతి చేసిన డాన్సులు, పెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. నట్టి క్రాంతి ఇంకా మంచి మంచి అవకాశాలతో ముందుకెళ్లాలని దీవిస్తున్నాను. ఎలాంటి శిక్షణ లేకుండానే క్రాంతి చాలా బాగా డ్యాన్స్ చేసాడు. నట్టి క్రాంతి డ్యాన్స్ చూస్తుంటే మొదటిసారి డాన్స్ చేస్తున్నట్లుగా అనిపించడం లేదు అని అందరూ అంటుంటే హ్యాపీగా ఉందని నట్టి కుమార్ అన్నారు.

బిగ్‌బాస్ ఫేమ్, సింగ్ రాహుల్ సిప్లిగంజ్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. గతంలో మేము ఒక సాంగ్ మేకింగ్ వదిలాం. ఆ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

నటీ నటులు, సాంకేతిక నిపుణులు
నటీ నటులు: నట్టి క్రాంతి, కృష్ణ ప్రియ, సంపూర్ణ మలకర్, అప్పాజి, మీనా, రూపలక్ష్మి, చమ్మక్ చంద్ర, కబుర్లు నవ్యా, రమ్య తదితరులు
సమర్పణ: శ్రీధర్ పొత్తూరి
బ్యానర్: నట్టి ఎంటర్ టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత: నట్టి కరుణ ,అనురాగ్ కంచర్ల
దర్శకత్వం: నట్టి కుమార్
సంగీతం: యస్ఏ ఖుద్దూస్
పాటలు: రాహుల్ సిప్లిగంజ్
లిరిక్ రైటర్: వెంకట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X