Swetaa varma ఖర్చుకు వెనుకాడకుండా కొండవీడు.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్
బీపిఆర్ సినిమా పతాకంపై దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మ, ప్రతాప్‌రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం కొండవీడు. ఈ నెల 8 న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా..

చిత్ర నిర్మాత బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..మా "కొండవీడు" సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా కోవిడ్ కారణంగా విడుదల చేయలేకపోయాం.దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాను చాలా ఫారెస్ట్ లొకేషన్స్ లలో షూట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు సినిమా చూడడానికి వచ్చి తనకు నచ్చడంతో తను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు సిద్దార్థ శ్రీ మాట్లాడుతూ.. మా కొండవీడు సినిమా నిర్మాత ప్రతాప్ రెడ్డికు నేను చెప్పిన కథ నచ్చగానే నన్ను నమ్మి బీపీఆర్ బ్యానర్‌లో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. సినిమా తీస్తున్నప్పుడు ఫారెస్ట్ లోకానీ ఇతర లొకేషన్స్‌లో ఫైట్స్, పాటల విషయంలో ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నన్ను నమ్మి ఇంత మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటి బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ మాట్లాడుతూ.. మా కొండవీడు సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు.కోవిడ్ టైమ్ లో చాలా సినిమాలు చేశాను. నేను బిగ్ బాస్ లో ఉన్నపుడు ప్రతాప్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు.ఈ సినిమాను మొదట ఓటిటి లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.అయితే రామకృష్ణ గారు చూసి మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమా థియేటర్ లో రిలీజ్ చేయాలని ముందుకు వచ్చాడు. ఇందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాతలు కోవిడ్ సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మంచి అవుట్ పుట్ వచ్చే వరకు మాతో వర్క్ చేసుకున్నాడు. ఇలాంటి మంచి దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీ లో ఉండడం వలన ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. ఈ నెల 8 న వస్తున్న మా చిత్రాన్ని మమ్మల్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, ఆర్టిస్ట్ ప్రతాప్ తదితరులు ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకొన్నారు.
నటీనటులు: బిగ్‌బాస్ ఫేం శ్వేతావర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్‌రాజ్ తదితరులు
బ్యానర్: బి. పి.ఆర్ సినిమా
నిర్మాతలు: బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి మధుసూధనరాజు
దర్శకుడు: సిద్ధార్థ్ శ్రీ
డిస్ట్రిబ్యూటర్: రామకృష్ణ
సినిమాటోగ్రాఫర్: రఘు రాయల్
సంగీతం: కనిష్క
ఎడిటర్: శివ శర్వాణి
పీఆర్వో: మధు వీఆర్


Click it and Unblock the Notifications











