Syed Sohel Ryan యాదాద్రిలో ఘనంగా సోహైల్ కొత్త చిత్రం.. సరికొత్త అధ్యాయం అంటూ నిర్మాత లక్ష్మణ్
బిగ్‌బాస్ తెలుగు 4 ద్వారా బుల్లితెర ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే సయ్యద్ సోహైల్ ర్యాన్. బిగ్‌బాస్ షోకు ముందు కొత్త బంగారు లోకం, యురేకా లాంటి చిత్రాలతో ప్రతిభను చాటుకొన్న సోహైల్.. బిగ్‌బాస్ తర్వాత సోహైల్ వరుస సినిమాలతో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నాడు. సినిమాల ఎంపికలోను వైవిధ్యాన్ని చాటుకొంటున్నాడు.

మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాను నటించిన ఓ సినిమాను రిలీజ్‌కు సిద్దం చేస్తూనే మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టాడు. మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో తన కొత్త సినిమాను ప్రకటించాడు.

సయ్యద్ సోహైల్ ర్యాన్ హీరోగా కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న మొదటి చిత్రం పూజ కార్యక్రమం యాదాద్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత లక్షణ్ మాట్లాడుతూ.. సోహైల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విభినమైన కథతో తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా కంటెంట్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. దర్శకులే నిర్మాతలైతే కంటెంట్‌పై ఏ రేంజ్ కసరత్తు జరుగుతుందనేది నిదర్శనమే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ చిత్రంతో సోహైల్ తన కెరీర్ పరంగా మరో లెవెల్‌కు వెళ్తాడని ప్రగాఢ నమ్మకం ఉంది. ఈ సినిమా సెన్సేషనల్ విజయం సాధించడానికి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.


Click it and Unblock the Notifications











