VJ Sunny కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా సౌండ్ పార్టీ.. బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు విజేత వీజే సన్నీ వరుస సినిమాలతో జోష్ పెంచాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అభిమానులకు, ప్రేక్షకులకు స్వచ్చమైన వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్నాడు. విభిన్నమైన కంటెంట్, కామెడీ ఎలిమెంట్స్, భారీ తారాగణంతో ఆయన నటించిన సినిమా సౌండ్ పార్టీ. సంజయ్ శేరి నూతన దర్శకుడి పరిచయమవుతూ రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు జయ శంకర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సౌండ్ పార్టీ మూవీ పోస్టర్‌ను ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రముఖులు మాట్లాడుతూ..
సౌండ్ పార్టీ టైటిల్ వినగానే మంచి ఫీల్ కలుగుతున్నది. పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టైటిల్ చూస్తే ఈ సినిమా కాన్సెప్ట్ పూర్తి వినోదాన్ని పంచేలా ఉందనే విషయం స్పష్టమవుతున్నది. ఈ సినిమా ఘన విజయం సాధించి దర్శక, నిర్మాతలకు మంచి లాభాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంచి గుర్తింపు రావాలని కోరుకొంటున్నాను అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు అందించారు.

ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సౌండ్ పార్టీ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత గారు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. సౌండ్ పార్టీ టైటిల్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. పోస్టర్‌కు కూడా మంచి స్పందన వస్తున్నది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని నిర్మాత రవి పొలిశెట్టి తెలిపారు.
బిగ్‌బాస్ తెలుగు విన్నర్, సౌండ్ పార్టీ హీరో వీజే సన్నీ మాట్లాడుతూ.. మా సినిమా పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత గారు ఆవిష్కరించడం చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్క్రిప్టులో ఊహించిన దాని కంటే.. మూవీ అవుట్‌పుట్ బాగా వచ్చింది అని అన్నారు.
సౌండ్ పార్టీ టైటిల్ ఎందుకోసం పెట్టామో ఆ ఉద్దేశ్యం నెరవేరింది. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సినిమా పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్సీ కవిత గారికి ధన్యవాదాలు. త్వరలో రిలీజ్ డేట్‌ను ఆవిష్కరిస్తాం అని సమర్పకుడు జయశంకర్ అన్నారు.
చిత్ర సమర్పకుడు జయశంకర్ మాట్లాడుతూ...మేము ఏ ఉద్దేశ్యంతో టైటిల్ పెట్టామో దానికి రీచ్ అయ్యాము. టైటిల్ విన్న వారంతా కూడా చాలా బావుంది అంటున్నారు. ఈ రోజు మా సినిమా పోస్టర్ లాంచ్ చేసిన కవిత గారికి ధన్యవాదాలు. మా నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గ్రాండ్ గా పిక్చరైజ్ చేశాము. త్వరలో విడుదలకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తాం అన్నారు.
నటీనటులు: వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, 'మిర్చి' ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, 'జెమిని' సురేష్, భువన్ సాలూరు, ఐ డ్రీమ్ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ తదితరులు
నిర్మాతలు: రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర
సమర్పణ: జయశంకర్
రచన, దర్శకత్వం: సంజయ్ శేరి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: శ్రీనివాస్‌రెడ్డి
ఎడిటర్: జి. అవినాష్
సంగీతం: మోహిత్ రెహమానిక్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
లిరిక్స్ : పూర్ణ చారి
పీఆర్వో: జీ కె మీడియా
లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు


Click it and Unblock the Notifications











