Bitcoin బిట్ కాయిన్ బ్యాక్ డ్రాప్‌తో సౌండ్ పార్టీ.. వీజే సన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు విజేత వీజే సన్నీ హీరోగా నటించిన చిత్రం సౌండ్ పార్టీ (Sound Party). రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. దర్శకుడు జయశంకర్ సమర్పించారు. ఈ సినిమా ద్వారా అమని మేన కోడలు హ్రితిక శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ..
సౌండ్ పార్టీ చిత్రం బిట్ కాయిన్ ఓ అంశంగా సాగే కామెడీ, ఎమోషనల్ మూవీ. భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రంలో బిట్ కాయిన్ అంశంగా ఆకట్టుకొంటుంది. బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఆ కాయిన్ చుట్టు కథ ఎలా తిరిగింది అనే విధాన్ని తెర మీదకు తీసుకొచ్చాం అని వీజే సన్నీ తెలిపారు.

నిర్మాత రవి పొలిశెట్టి మాట్లాడుతూ.. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. సౌండ్ పార్టీ టైటిల్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. బిజినెస్ పరంగా కూడా ట్రేడ్ వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. వీజే సన్నీ, శివన్నారాయణ మధ్య కామెడీ ట్రాక్ బాగా వచ్చింది. వరల్డ్ వైడ్‌గా నవంబర్ 24 తేదీన గ్రాండ్‌గా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని అన్నారు.

సమర్పకుడు జయ శంకర్ మాట్లాడుతూ... సౌండ్ పార్టీ మూవీలో పాటలు, టీజర్ ప్రేక్షకులు ఆదరించారు. దర్శకుడు సంజయ్ శేరికి ఏ నమ్మకంతో అయితే సినిమా ఇచ్చామో దాన్ని నిలబెట్టుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ను ప్రేక్షకులకు అందించే సిద్దమయ్యాడు అని అన్నారు.
దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ.. సౌండ్ పార్టీ సినిమా కథను నమ్మి నిర్మాతలు రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాను చూసిన కొందరు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నటీనటులు, నిర్మాతలు ఇచ్చిన సపోర్టు వల్లే ఈ సినిమాను పూర్తి చేయగలిగాను. సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాను అని అన్నారు.

నటీనటులు: శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, మిర్చి ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, 'జెమిని' సురేష్, భువన్ సాలూరు, 'ఐ డ్రీమ్' అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్జె హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ తదితరులు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: శ్రీనివాస్ రెడ్డి
ఎడిటర్: జీ అవినాష్
సంగీతం: మోహిత్ రెహమానిక్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
కో రైటర్స్: పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల
లిరిక్స్: పూర్ణ చారి
చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న
కో-డైరెక్టర్: బీ సంతోష్ కృష్ణ
అసోసియేట్ డైరెక్టర్స్: యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి
అసిస్టెంట్ డైరెక్టర్స్: యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్
పిఆర్వో: జీ కె మీడియా
లైన్ ప్రొడ్యూసర్: శివకాంత్ వంగ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు.
నిర్మాతలు: రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర
సమర్పణ:జయశంకర్
రచన, దర్శకత్వం: సంజయ్ శేరి


Click it and Unblock the Notifications











