ఫేస్‌బుక్‌లో మహేష్‌ కత్తి నోటి దురుసు.. గడ్డిపెట్టిన కౌశల్!

బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ నడుస్తున్న సమయంలో సినీ, రాజకీయ విమర్శకుడు మహేష్ కత్తి సోషల్ మీడియాలో కామెంట్లు విసురుతున్నాడు. కౌశల్ గురించి ప్రతికూలంగా కామెంట్లు పెడుతూ వచ్చాడు. బిగ్‌బాస్‌లో కౌశల్ చాలా నస, విసుగుపుట్టించే (ఇరిటేట్) వ్యక్తి అని ఫేస్‌బుక్‌లో పోస్టుల వర్షం కురిపించాడు. వీలైతే తాను దీప్తి నల్లమోతు తరఫున ప్రచారం చేస్తానని పోస్టులు పెట్టినట్టు వార్తలు వచ్చాయి..

Bigg Boss Winner Kaushal serious comments on Mahesh Kathi

కౌశల్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్ గురించి వివాదాస్పద కామెంట్ చేశాడు. భళ్లాలదేవ గెలిచిన బాహుబలి సినిమా బిగ్‌బాస్2 అని కామెంట్ చేశారు. మహేష్ కత్తి చేసిన కామెంట్ గురించి ఓ మీడియా ఛానెల్‌లో స్పందించాలని కోరగా కౌశల్ తనదైన శైలిలో స్పందించాడు.

Bigg Boss Winner Kaushal serious comments on Mahesh Kathi

భళ్లాల దేవుడు గెలిచాడా? లేదా బాహుబలి గెలిచాడా అనే పాయింట్ కాదు. గెలిచాడా అనేది ముఖ్యం. గెలుపు గెలుపుగానే భావించాలి. ఇంట్లో నేను ఎలా ఆడాను. ఎంత బాగా ఆడాను. ఎలా గెలిచానని చూడాలి. గెలుపు గెలుపే అని కౌశల్ అన్నాడు.

ఇంట్లో నేను బాహుబలి అని నిరూపించుకొన్నాను. నన్ను ఎవరైనా భళ్లాలదేవ అని పిలిచినా.. ఇంకేమైనా అన్నా నేను పట్టించుకొను అని కౌశల్ అభిప్రాయపడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X