దటీజ్ నూతన్ నాయుడు.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ.. రెమ్యునరేషన్ లేకుండా 14 చిత్రాల్లో..
బిగ్‌బాస్ 2 రియాలిటీ షోతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి నూతన్ నాయుడు తారాజువ్వలా దూసుకొచ్చాడు. బిగ్‌బాస్‌లో తనదైన యాటిట్యూడ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. సామాజిక, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే నూతన్ ఇప్పుడు సరికొత్తగా సెన్సేషన్‌గా మారబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా మారబోతున్నాడనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్2లో అరుదైన రికార్డు
బిగ్‌బాస్ 2లో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు నూతన్ నాయుడు. తొలి దశలోనే ఎలిమినేట్ అయిన నూతన్ ప్రజాతీర్పుతో అత్యధిక ఓట్లు సాధించి మళ్లీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తనదైన శైలిలో ఆటను రక్తికట్టించాడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం చూసి ఆయన గేమ్‌ను ఆదరించారు. చివర్లో పోటీ తీవ్రతరం కావడంతో షో నుంచి బయటకు వచ్చారు.

ఎఫ్2 మూవీతో టాలీవుడ్‌లోకి
బిగ్‌బాస్ అనంతరం సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉన్న నూతన్ వాటిని ఓ పక్క కొనసాగిస్తూనే మరో పక్క టాలీవుడ్‌లోకి కాలుపెట్టాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఎఫ్2 సినిమాతో సినిమాల్లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నూతన్ నాయుడు కనిపించబోతున్నాడనే సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఎఫ్2 సినిమా ఆఫర్‌తో 14 సినిమాలు
దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చిన ఎఫ్2 సినిమా ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొన్న నూతన్ నాయుడు ప్రస్తుతం 14 సినిమాలకు ఓకే చెప్పినట్టు తెలుస్తున్నది. కొన్ని సినిమాలకు అగ్రిమెంట్ కూడా జరిగిందట. నూతన్ నాయుడు దూకుడు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

RRR, సైరా లాంటి చిత్రాల్లో
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న RRR మూవీలోనూ, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో నూతన్ నాయుడు నటిస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరికొన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రాల్లోనూ నూతన్ నాయుడు నటిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

పారితోషికం తీసుకోకుండానే
బిగ్‌బాస్ షోలో రెమ్యునేరేషన్ తీసుకోకుండా పాల్గొన్న నూతన్ నాయుడు తను నటిస్తున్న సినిమాలకు కూడా రెమ్యునేరేషన్ తీసుకోవడం లేదంట. సినిమా షూటింగ్‌కు హాజరుకావడానికి అయ్యే ప్రయాణ, వసతి, భోజన ఖర్చులు కూడా తానే భరిస్తున్నట్టు తెలిసింది. నిర్మాతలకు అదనపు భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కథ, కంటెంట్, నిర్మాణ విలువలు బాగుంటే ఇకముందు కూడా పారితోషికం లేకుండానే నటిస్తానని నిర్మాతలకు నూతన్ నాయుడు స్పష్టం చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











