Acharya: మెగా ప్రాజెక్ట్ కోసం భారీ ప్లాన్స్.. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొణిదెల ప్రొడక్షన్స్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరగనుంది అలాగే ట్రైలర్ ఎప్పుడు విడుదల కానుంది అనే విషయాలపై చాలా రూమర్స్ వస్తూ ఉండగా ఆ వార్తలపై నిర్మాత ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా అనంతరం వీలైనంత త్వరగా మరొక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. ఆచార్య సినిమా ప్లాన్ ప్రకారం అయితే ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని మెగాస్టార్ అనుకున్నాడు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఆ సినిమా షూటింగ్ కు చాలా సార్లు బ్రేకులు పడ్డాయి అంతేకాకుండా విడుదల తేదీ విషయంలో కూడా మిగతా సినిమాలతో క్లాష్ రావద్దని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ట్రైలర్ డేట్
ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో ఇటీవల చిత్ర నిర్మాత అన్వేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ట్రైలర్ ను మూవీ విడుదలకు రెండు వారాల ముందు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు గా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కానుందని అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కానీ నిర్మాత మాత్రం ఇంకా ఆ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ప్రీ రిలీజ్ ఈవెంట్
ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే విషయంలో కూడా ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా కాబట్టి తప్పకుండా మెగా అభిమానులు రెండు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో తరలివచ్చే అవకాశం ఉంది. సినిమా విడుదలకు ఒక వారం ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్న ట్లుగా నిర్మాత అన్వేష్ రెడ్డి వివరణ ఇచ్చారు.
Recommended Video


భారీ స్థాయిలో రిలీజ్
అంతేకాకుండా ఆచార్య సినిమా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు కూడా అన్వేష్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఆచార్య సినిమాను భారీ స్థాయిలో విడుదల కానుందట. దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్ లలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఆచార్య సినిమా RRR నాన్ రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టోటల్ గా ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











