twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృ‌తిక్ ‘సూపర్ 30’కి అరుదైన గౌరవం.. బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    |

    బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. పాట్నా పట్టణానికి చెందిన గణితశాస్త్ర బోధకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి బీహార్ ప్రభుత్వం వినోద పన్నును మినహాయించింది. జూలై 12న రిలీజైన ఈ చిత్రం సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సత్తాను చాటుతుండటం విశేషం. ఈ సందర్భంగా బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి సుశీల్ కుమార్ మోడీ పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

    పన్ను మినహాయింపు ప్రకటన చేయడానికి ముందు డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ తన సతీమణితో కలిసి సూపర్ 30 చిత్రాన్ని వీక్షించారు. ఆ తర్వాత సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం ప్రభుత్వం తరఫున స్పందిస్తూ అరుదైన గౌరవాన్ని అందించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత వికాస్ బెహల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

    Bihar Government announces tax excemption for Super 30

    ఇక సూపర్ 30 చిత్రంలో ఆనంద్ కుమార్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి బీహారీ భాషను, యాసను అద్భుతంగా పండించిన హృతిక్‌ రోషన్‌పై విమర్శకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. పాట్నాలో సూపర్ 30 అనే పేరుతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉచితంగా ఐఐటీ, ఎన్ఐటీ లాంటి పరీక్షలకు సన్నద్ధం చేసి అద్భుతమైన సేవను చేసిన వ్యక్తిగా ఆనంద్ కుమార్‌కు స్థానికంగా గొప్ప పేరు ఉంది. ప్రస్తుతం అందరికీ స్ఫూర్తిని కలిగించే విధంగా ఈ చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించారు.

    English summary
    Super 30 movie based Patna-based Mathematics teacher Anand Kumar has been doing well in all the corner. In this occassion, Bihar government and Deputy Chief Minister Sushil Kumar Modi announces tax excemption in the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X