సరికొత్త కాన్సెప్ట్‌తో బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్, ఎమోషనల్‌గా.. కామెడీతో!

ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై యువ దర్శకుడు నాగసాయి మాకం దర్శకత్వంలో మహంకాళి శ్రీనివాస్ నిర్మించిన చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. జీవితంలో ఎన్నో ఒత్తిడులు. రోజంతా కష్టానికి మనపై పడిన ప్రభావమది. ఒక చిన్న చిరునవ్వు ఆ మొత్తం ఒత్తిడిని చిత్తు చేస్తుంది. మనసుకు హాయినిస్తుంది. మనం పడిన శ్రమనంతా గతాన్ని చేసేస్తుంది. మరి అలాంటి నవ్వు రెండున్నర గంటలు దక్కితే ఎంత ఉల్లాసంగా ఉంటుంది. అలాంటి నవ్వును పంచేందుకు ఈ చిత్రం సిద్ధమవుతున్నది. యువ దర్శకుడు నాగసాయి మాకం తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా మార్చి 15న ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది.
మరిన్ని వివరాల కోసం...

వినోదం పంచడమే ధ్యేయంగా

వినోదం పంచడమే ధ్యేయంగా

ఈ సందర్భంగా నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ...సినిమా ధ్యేయం వినోదాన్ని పంచడం అయితే నవ్విస్తూ ఒక చిన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలిగిస్తే ఆ చిత్రానికి సార్థకత చేకూరినట్లే. అలాంటి సార్థక చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో సందేశాన్ని కలిపి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఎంత నాణ్యమైన చిత్రాన్ని నిర్మించామో, అంతే ఘనంగా మార్చి 15న విడుదల చేస్తున్నాం. అన్నారు.

నవ్వులు, సాధకబాధకాలతో సినిమా

నవ్వులు, సాధకబాధకాలతో సినిమా

దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ....నా తొలి చిత్రం ప్రేక్షకుల తీర్పునకు వస్తుండటం సంతోషంగా ఉంది. మేము రూపొందించిన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది మా సినిమా. బిలాల్ పూర్ కథలో నవ్వులు, బాధలు, సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలు, పోలీసు ఉద్యోగంలోని సాదకబాధకాలు అన్నీ ఉంటాయి.

హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో

హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో

సంగీత సాహిత్యాలు ఆకట్టుకుంటాయి. సాబూ వర్గీస్ సంగీతం, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా పాటలు కథా విలువను పెంచుతాయి. సమాజంలో జరుగుతున్నకొన్ని చేదు ఘటనలు కూడా ఉంటాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది అని నాగసాయి మాకం అన్నారు.

నటీనటులు, సాంకేతికవర్గం

నటీనటులు, సాంకేతికవర్గం

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - తోట వి రమణ, ఎడిటింగ్ - ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం - సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ - జీబూ, డీటీఎస్ - రాజశేఖర్, పాటలు - గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనిశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత - మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం - నాగసాయి మాకం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X