twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara సినిమాలో నటించిన ఆ చిన్నారి ఎవరో తెలుసా.. చైల్డ్ ఆర్టిస్ట్ లలోనే అత్యధిక రెమ్యునరేషన్!

    |

    ఇటీవల కాలంలో చైల్డ్ ఆర్టిస్టులు పెద్దగా క్రేజ్ అయితే అందుకోవడం లేదు. గతంలో ఒక సినిమాలో నటించిన బాల నటులు కంటిన్యూగా కొన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారు. అయితే ప్రస్తుతం మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా వారిని మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తు మరిన్ని అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్గా అయితే శ్రీదేవి అనే చిన్నారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బింబిసార సారా సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించిన ఈ చిన్నారి ఒకవైపు టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు సినిమాల్లో కూడా బిజీగా మారిపోయింది. ఆమె ఎవరు? బ్యాగ్రౌండ్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

    ఎమోషనల్ పాత్ర

    ఎమోషనల్ పాత్ర

    కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బింబిసారా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి ముఖ్యంగా చిన్నారి శ్రీదేవి నటించిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది.

    బ్యాక్ గ్రౌండ్

    బ్యాక్ గ్రౌండ్

    కళ్యాణ్ రామ్ తో చాలా ఎమోషనల్ పాత్రలో నటించిన ఆ చిన్నారి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే వివరాలను కోసం కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు. ఈ ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసింది అనే వివరాల్లోకి వెళితే..

    నాలుగవ తరగతి

    నాలుగవ తరగతి

    చిన్నారి శ్రీదేవి బేతంచెర్ల పట్టణానికి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూతురు. గత 18 ఏళ్లుగా సినీ రంగంలో ఆర్టిస్టుగా కూడా ఉన్న శ్రీహరి గౌడ అనే వ్యక్తి కొన్ని సీరియల్స్ కు సినిమాలకు కూడా ప్రొడక్షన్ మేనేజర్ గా వర్క్ చేశాడు. అయితే అతనికి ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె శ్రీదేవి కాగా ఆమె ఇటీవల నటిగా తన సినిమా కెరీర్ ను మొదలుపెట్టింది ప్రస్తుతం ఆ చిన్నారి నాలుగో తరగతి చదువుతోంది.

     బిజీబిజీగా

    బిజీబిజీగా

    ఇటీవల కాలంలో అత్యధిక వేగంగా చాలా ఎక్కువ స్థాయిలో సినిమాలు సీరియల్స్ చేసిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇప్పటివరకు పది సినిమాలు చేసింది. అంతేకాకుండా 15 టీవీ సీరియల్స్ లో కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించింది. ప్రస్తుతం కూడా కొన్ని సీరియల్స్ లో ఆమె పాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది.

     వరుసగా సీరియల్స్ తో

    వరుసగా సీరియల్స్ తో

    ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న యమలీల సీరియల్ లో కూడా శ్రీదేవి పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అందులో ఆమె చాలా ఎమోషనల్ గా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ సీరియల్ ద్వారానే శ్రీదేవికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. అలాగే ప్రేమ, పౌర్ణమి, చెల్లెలికాపురం, ముద్దమందారం, కల్యాణ వైభోగం ఇలా దాదాపు 15 టీవీ సీరియల్స్ లో ఆమె బాలనటిగా నటించింది.

    మరో మూడు సినిమాలు

    మరో మూడు సినిమాలు

    చిన్నారి శ్రీదేవి ఇటీవల వచ్చిన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాల్లో కూడా కనిపించింది. అలాగే ఆమధ్య సూపర్ మచ్చి సినిమాల్లో కూడా ఒక మంచి పాత్రలో కనిపించింది. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్నా బాలనాటి చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి మంచి గుర్తింపు అందుకుంటోంది. త్వరలోనే మరొక మూడు సినిమాలలో కూడా నటించబోతోంది. అలాగే రెండు సీరియల్స్ కూడా ఆమె లిస్టులో ఉన్నాయి. ఇక పారితోషికం విషయంలో కూడా ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్టులలో ఈ చిన్నారి అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Bimbisara movie child artist sridevi background details and remuneration
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X