మెగా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపిన సాయిధరమ్ తేజ్.. ఏమన్నాడంటే!
నందమూరి హీరోల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. తెలుగు చిత్ర సీమలో తాత నందమూరి తారక్ రామారావు పోలికలతో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తాత లాగే ఈయనకు కూడా అశేష అభిమాన వర్గం సొంతమైంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ టాప్ స్టార్‌గా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ రోజు (మే 20). ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటు అభిమానులతో పాటు అటు ఇండస్ట్రీ వర్గాలతోను ఎంతో కలివిడిగా ఉంటారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యూచర్ కోరుకుంటూ బర్త్ డే చెబుతున్నారు ఇండస్ట్రీ లోని ప్రముఖులంతా. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన జవాన్ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు.
ఈ సందర్బంగా వెరీ హ్యాప్పీ బర్త్ డే ఎన్టీఆర్.. ఆ దేవుడి కృప నీపై ఎల్లప్పుడూ ఉండాలి. నీ జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలు విరజిమ్మాలని ప్రేమతో కోరుకుంటున్నా అని ట్యాగ్ చేశారు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన మెగా, నందమూరి అభిమానులు ఖుషీ అవుతూ ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అరవింద సమేత' విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జులై నెలలో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











