మరో మెట్టెక్కిన ప్రభాస్.. అన్నా అంటూ మెగా మేనల్లుడు.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ కొట్టేసిన ఆయన, వరుస సినిమాలతో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇటీవలే దేశమంతా సాహోరే అనిపించిన ఈ యంగ్ రెబల్ స్టార్ నేటితో 40 సంవత్సరాలు పూర్తిచేసుకొని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.

ప్రభాస్‌ని ఆకాశానికెత్తేస్తున్న సినీ ప్రముఖులు
అక్టోబర్ 23 వ తేదీ 1979 సంవత్సరం జన్మించిన ప్రభాస్.. నేటికి 40 ఏళ్ల ప్రయాణం పూర్తిచేసి మరో మెట్టెక్కారు. ఈ సందర్బంగా ఆయనకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రభాస్ టాలెంట్‌ని పొగుడుతూ ఆయన్ను ఆకాశానికెత్తేస్తున్నారు.
ప్రభాస్ గురించి బండ్ల గణేష్
''ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. బండ్ల గణేష్'' అని పేర్కొంటూ ప్రభాస్ స్మార్ట్ లుక్ పోస్ట్ చేశాడు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.
వెన్నెల కిషోర్ ఇలా అన్నాడు
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వెన్నెల కిషోర్.. ప్రభాస్‌కి తన విషెష్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ''మన డార్లింగ్ ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నాడు వెన్నెల కిషోర్.
ప్రభాస్ అన్నా అంటూ మెగా మేనల్లుడు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ప్రభాస్‌ని అన్న అని సంబోధిస్తూ బర్త్ డే విషెష్ తెలియజేశాడు. ఈ సంవత్సరం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రభాస్‌తో కలిసి దిగిన పిక్ షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్.
ప్రముఖ నిర్మాత బీఏ రాజు
''వరల్డ్ వైడ్ అభిమానుల ఆదరణ అందుకుంటూ సంచలన విజయాలు సాధిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ కి హ్యాపీ బర్త్ డే...'' అంటూ ప్రముఖ సినీ పీఆరో, నిర్మాత బీఏ రాజు ట్వీట్ చేశారు.
యూవీ క్రియేషన్స్ మొదలుకొని అందరూ వరుసగా..
ప్రభాస్ తాజా సినిమా సాహో తెరకెక్కించిన యూవీ క్రియేషన్స్ మొదలుకొని ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ ప్రభాస్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సక్సెస్ కోరుకున్నాయి.


Click it and Unblock the Notifications











