For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిత్తిరి సత్తికి మళ్లీ పెళ్లి.. ముహుర్తం మించిపోతోందంట

    |

    బిత్తిరి సత్తి బుల్లితెరపై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. తనదైన స్టైల్లో తెలంగాణ యాసలో మాట్లాడి బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిత్తిరి సత్తి వెండితెరపైనా అప్పుడప్పుడు మెరుస్తూ ఉన్నాడు. పూర్తిగా హీరో పాత్రను చేస్తూ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు.

    కామెడీతో నవ్విస్తోన్న సత్తి..

    కామెడీతో నవ్విస్తోన్న సత్తి..

    వార్తలను కూడా ఎంటర్టైన్మెంట్‌గా చెప్పడమే బిత్తిరి సత్తి ప్రత్యేకం. సావిత్రి, బిత్తిరి సత్తి కాంబినేషన్ అంటే తెలంగాణ‌లో తెలియని వారెవరూ ఉండరు. సావిత్రిగా అలరించిన శివజ్యోతి ప్రస్తుతం బిగ్‌బాస్ షోలో దుమ్ముదులుపుతూ ఉంటే.. బయట సత్తి హీరోగా మారి సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో, తాను మాత్రమే పలకగలిగే భిన్న పదాలు ఇలా బిత్తిరి సత్తిని అందరి కంటే ప్రత్యేకంగా నిలిచేలా చేశాయి.

    అడపదడపా సినిమాలు..

    అడపదడపా సినిమాలు..

    బుల్లితెరపై తనకు పెరిగిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు వెండితెరపైనా అప్పుడప్పుడు మెరుస్తూ ఉన్నాడు. అయితే చిన్న చిన్న కామెడీ పాత్రలను చేస్తూ వచ్చిన బిత్తిరి సత్తి ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా అవతారమెత్తాడు.

    తుపాకి రాముడుగా ప్రేక్షకుల ముందుకు..

    తుపాకి రాముడుగా ప్రేక్షకుల ముందుకు..

    తుపాకి రాముడు సినిమాతో బిత్తిరి సత్తి పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యాడు. అదే వేదికపై యాంకర్ సుమ.. బిత్తిరి సత్తి కుటుంబాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది.

    పెళ్లి కాలేదేమోనని ఊహలు..

    పెళ్లి కాలేదేమోనని ఊహలు..

    ఇంతవరకు బుల్లితెరపై వార్తలు చెప్తూ వేసిన స్కిట్లలో బిత్తిరి సత్తికి పెళ్లి కాలేదని చెబుతుండటంతో అందరూ నిజమనే అనుకున్నారు. బిత్తిరి సత్తికి పెద్ద ఫ్యామిలీ ఉందని, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉందని ఎవ్వరూ ఊహించలేదు. ఇదే విషయాన్ని వేదికపై చెబుతూ.. ఆమె షో ద్వారా తన ఫ్యామిలీని ప్రపంచానికి పరిచయం చేస్తోందని బిత్తిరి సత్తి పేర్కొన్నాడు.

    ఎఫ్3 షోలో ఫ్యామిలీతో పాల్గొన్న సత్తి..

    సెలబ్రెటీల ఫ్యామిలీని ప్రేక్షకులకు పరిచయం చేపిస్తూ.. వారితో ఆటలు ఆడిస్తూ.. బుల్లితెర ప్రేక్షకుల ఎంటర్టైన్ చేస్తోంది సుమ. ఈ వారంలో బిత్తిరి సత్తి తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నాడు. అయితే ఈ షోలో.. బిత్తిరికి సత్తికి మళ్లీ పెళ్లి చేసింది. తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం, భోజనాల ఏర్పాట్లను చేసిన సుమ.. అనంతరం ఓ పంచ్ వేసింది. ఇక ముహుర్తానికి సమయం అవుతోంది పదా అంటూ చెప్పగా.. బిత్తిరి సత్తి షాక్ అయి ఒక్కసారిగా సుమవైపు చూశాడు. మరి బిత్తిరి సత్తి తన ఫ్యామిలీతో కలిసి చేసిన సందడిని పూర్తిగా చూడాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.

    English summary
    Bithiri Sathi With His Family In Suma F3 Programme. In Her Show She Did Again Marriage To Bithiri Satthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X