twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో రైటర్ అనంత శ్రీరామ్.. పోలీసులకు ఫిర్యాదు, అసలు ఏమైందంటే?

    |

    ఈ మధ్య కాలంలో వరుసగా టాలీవుడ్ సినిమాలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. తమ మతాన్ని కించపరచారని, లేదా, తమ వర్గాన్ని కించపరిచారని ఉద్దేశంతో ఎవరో ఒకరు సినిమాలను వివాదాల్లోకి లాగడం కామన్ అయిపోయింది. దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయని ముందు నుంచి తెలిసి కూడా ఏ మాత్రం శ్రద్ధ తీసుకోకుండా జనాల్లోకి వదిలేస్తున్నారు. బహుశా ప్రమోషన్స్ కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నారో ఏమో తెలియదు గానీ వారం రోజుల వ్యవధిలో మూడు సినిమాలు ఈ హిందూ దేవుళ్ళ మీద వివాదాస్పదంగా పాటలు రాసి హిందూ సంఘాలకు టార్గెట్ అయ్యాయి. గతంలో హిందూ సంఘాల వారు పెద్దగా ముందుకు వచ్చే వాళ్ళు కాదు కానీ ప్రస్తుతం హిందూ సంఘాల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటూ హిందూ దేవుళ్ల గురించి ఏమాత్రం తేడా అనిపించినా మీడియా ముందుకు రావడమే కాక లీగల్ గా కూడా ముందుకు వెళుతూ సినిమాల వాళ్ళను మళ్ళీ సరైన విధంగా పాటలు రిలీజ్ చేసేలా చేస్తున్నారు.

    కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే చిన్న సినిమా ట్రైలర్ లో పబ్ నేపథ్యంలో భజగోవిందం అనే ఒక సాంగ్ పెట్టడంతో ఆ పాట హిందూ సంఘాలు చెవిన పడిం.ది ఇక అంతే సోషల్ మీడియా వేదికగా మొదలైన వ్యవహారం హాట్ హాట్ గా మారి ఏకంగా దర్శకుడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్ళింది. అయితే ఈ విషయం కావాలని చేసింది కాదని పేర్కొన్న దర్శకుడు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేయడమే గాక యూట్యూబ్ నుంచి తొలగించి ట్రైలర్ కూడా తొలగించి మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మరో పాట కూడా వివాదాల్లో చిక్కుకుంది.. వరుడు కావలెను అంటూ నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమాలోని పాట తాజాగా విడుదలైంది. రీతూ వర్మ కాలు కదిపిన ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా తమన్ మ్యూజిక్ అందించాడు..

    BJP Files a Police case on lyric writer anantha sriram

    ఈ విషయం మీద కొద్ది రోజులుగా హాట్ హాట్ చర్చలు జరుగుతూ ఉండగా తమ దేవుడిని కించపరిచే విధంగా పాట రాశారు అని చెబుతూ ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ మీద బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వరుడు కావలెను సినిమా లోని దిగు దిగు దిగు నాగ పాట నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ రాశారని చెబుతూ నెల్లూరు లో ఉన్న పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.. అనంత శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని బిందు రెడ్డి ఆరోపించారు. నాగదేవతను కించపరిచే విధంగా రాసిన అనంత శ్రీరామ్ సహా సంగీతం అందించిన తమన్ అలాగే సినిమా కోసం వాడిన యూనిట్ మీద కూడా నెల్లూరు జిల్లా చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు.. బహుశా అనంత శ్రీరామ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి ఉండొచ్చని అంటున్నారు.

    English summary
    BJP leaders have lodged a complaint with the police against popular songwriter Anantha Sriram for allegedly writing a song insulting their god.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X