ఆమె బాడీలో ఎక్కడెక్కడ ఏముందో తెలుసు.. హీరోయిన్‌పై ఎమ్మెల్యే సంచలనం
దుబాయ్ నుంచి దొడ్డిదారిలో బంగారం తీసుకొస్తూ డీఆర్ఐ అధికారులకు దొరికిపోయిన కన్నడ సినీ నటి రన్యా రావు కేసులో రోజుకొక మలుపు తిరుగుతోంది. పొంతన లేని సమాధానాలతో అధికారులను ఇరుకున పెడుతున్న రన్యా రావు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా రన్యా రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
దుబాయ్ నుంచి 14 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మార్చి 3న అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఈ కేసులో చిక్కు ముడులు విప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలోని చిక్ మగళూరుకు చెందిన రన్యా రావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందు బీటెక్ చేసిన రన్యా రావుకు కిచ్చా సుదీప్ సినీ పరిశ్రమలో అవకాశం కల్పించారు.

2014లో సుదీప్ దర్శకత్వంలో వచ్చిన మాణిక్యలో హీరోగా నటించారు రన్యా రావు. ఆమెకు రన్యా అని పేరు పెట్టింది కూడా సుదీపే కావడం విశేషం. ఆ తర్వాత వాఘా, పటాకీ సినిమాలలో నటించింది. ఆమె సవతి తండ్రి , కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి కె రామచంద్రరావు అధికార హోదాను అడ్డుపెట్టుకుని గ్రీన్ ఛానెల్ ద్వారా పలుమార్లు రన్యారావు చెకింగ్ నుంచి తప్పించుకున్నారనే అభియోగాలు వెల్లువెత్తాయి. అయితే బంగారం తరలింపులో రామచంద్రరావు హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆమె చేసే పనులతో తమకు ఎలాంటి సంబంధం లేదని రామచంద్రరావు తెలిపారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, ఎండీగా ఉన్నారు. ప్రస్తుతం రన్యారావు వ్యవహారం వెలుగులోకి రావడంతో రామచంద్రరావును ప్రభుత్వం సెలవుపై పంపింది. అయితే ఈ కేసు విచారణాధికారులపై రన్యా రావు సంచలన ఆరోపణలు చేశారు. తనపై చేయి చేసుకున్నారని, దాదాపు 60 తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించారని ఆరోపించారు.
వారు చెప్పినట్లు వినకుంటే తన తండ్రిని ఇరికిస్తామని హెచ్చరించారని.. 24 గంటల పాటు ఉద్దేశపూర్వకంగా నిద్ర, ఆహారం పెట్టలేదని రన్యా రావు పేర్కొన్నారు. కాగా.. బంగారం అక్రమ రవాణా కేసులో కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులు, అధికారుల పాత్ర ఉండొచ్చని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కొందరు సిండికేట్‌లో ఏర్పడి గోల్డ్ స్మగ్లింగ్ చేయిస్తున్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణను సీబీఐకి అప్పగించారు.
ఈ నేపథ్యంలో రన్యా రావు కేసుపై కర్ణాటకలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజాపూర్ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీనటి రన్యారావు తన శరీరంలోని ఏయే పార్టుల్లో బంగారం దాచిందో తనకు తెలుసునంటూ వ్యాఖ్యానించారు. గోల్డ్ దందా వెనుక మంత్రుల ప్రమేయం ఉందని, అసెంబ్లీ సమావేశాల్లో అందరి బండారం బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం బసంగౌడ పాటిల్ వ్యాఖ్యలు కన్నడ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











