జానీ మాస్టర్‌ వివాదంపై రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్.. అలాంటి చట్టం తేవాలి అంటూ

Jani Master Case: టాప్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడం రెండు రాష్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంతో మంది స్టార్ హీరోస్,హీరోయిన్స్ దగ్గర పని చేసిన జానీ మాస్టర్ ఓ మహిళ డ్యాన్సర్ పై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. ఏకంగా ఆయనను పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ తరుణంలో జానీ మాస్టర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకోవాలని, తనను పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేశాడని ఓ లేడీ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాకుండా.. అవుట్ డోర్ పేరుతో తనని ముంబాయి, చెన్నై అంటూ ప్రాంతాలు తిప్పుతూ.. బలవంతంగా తనపై పలు మార్లు లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ పరార్ అయ్యారు. పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.

BJP MLA Raja Singh Sensational comments on Johnny Master Case
ఎట్టకేలకు జానీ మాస్టార్ ను గతరాత్రి బెంగుళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఆయనను విచారించిన అనంతరం రేపు (శుక్రవారం) కోర్టులో హాజరుపరుస్తారు. జానీ మాస్టర్ భార్య సైతం తన పై దాడికి ల్పడిందని ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెకు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజా ఈ విషయపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జానీ మాస్టర్ అరెస్ట్ కు కాసేపటి ముందు వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. "నార్సింగ్ పోలీస్ అధికారులకు, అదేవిధంగా కమిషనర్, డీజీ గారి గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా.. జానీ బాషా మాస్టర్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళ జూనియర్ కొరియోగ్రాఫర్ ను ఆయన ఏ విధంగా టార్చర్ చేశారో.. ఎలా ఇబ్బంది పెట్టారో.. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రజలు పోలీసులు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగని అరెస్టు చేస్తారోనని.. లవ్ జిహాదీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. నేను కూడా పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా" అని అన్నారు.

BJP MLA Raja Singh Sensational comments on Johnny Master Case

ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంకా మాట్లాడుతూ.. "జానీ బాషా మాస్టర్ అరెస్టయిన తర్వాత ఆయన ఇంకా ఎంత మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడో. ఇంకా ఎంతమంది అమ్మాయిలను కన్వెర్ట్ కావాలని ఆఫర్ ఇచ్చాడో ప్రజలు ముందు పెట్టాలని కోరారు. ప్రయత్నం ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ఇవాళ టాలీవుడ్ కు జానీ మాస్టర్ మచ్చ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు ' అని కీలక వ్యాఖ్యలు చేశారు.

'అందుకేటాలీవుడ్ పెద్దలకు మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా.. టాలీవుడ్ ను క్లీన్ చేయాలని, మహిళలను ఇబ్బంది పెట్టినా.. కన్వెర్ట్ అవ్వమని ఆఫర్ ఇచ్చినా.. వారు మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు చట్టం తీసుకురావాలి. ఎందుకంటే.. చాలా మంది హీరో హీరోయిన్ చూసి వారిని ఫాలో అయితారు. కానీ, ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం ఇండస్ట్రీకే చెడ్డ పేరు వస్తుంది. ఇండస్ట్రీ పెద్దలను జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.. జానీ మాస్టర్ ను అరెస్టు చేస్తే.. మర్డర్ చేసిన వాడ్ని ఎలా ఇంటరాగేషన్ చేస్తారో అదే విధంగా ఇంటరాగేషన్ చేయాలి. పెద్ద నేరాలకు పాల్పడిన వారికి ఎలా పనిష్మెంట్ ఇస్తారో అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. మొత్తం విషయాన్ని పోలీసులు బయటకు తీసుకురావాలి" అని రాజాసింగ్ కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X