రాత్రికి ఆ పని చేద్దామంది.. నా శీలాన్ని అలా కాపాడుకున్నా.. రేసుగుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం హీరోయిన్లను లైంగిక వేధించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎన్నో కలలతో చిత్రసీమలో అడుగుపెట్టే వర్ధమాన హీరోయిన్లు ఈ వేధింపులకు బలైపోతున్నారు. స్టార్ హీరోయిన్లు కూడా లైంగిక వేధింపుల బాధితులే కావడం దురదృష్టకరం. దేశంలో మీటూ ఉద్యమం ఉద్యమం ఉవ్వెత్తున లేచిన నాటి నుంచి కేరళలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వరకు క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు ఎన్నోసార్లు వెలుగు చూశాయి. ప్రతి నిత్యం ఎవరో ఒక హీరోయిన్ తమకు ఎదురైన వేధింపుల గురించి పంచుకుంటూనే ఉన్నారు. అయితే హీరోయిన్లే కాదు హీరోలు, ఇతర మేల్ ఆర్టిస్టులు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులేనని కొందరు బయటికొచ్చారు. తాజాగా రేసుగుర్రం విలన్ రవి కిషన్ కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్యాస్టింగ్ కౌచ్ బాధితుల్లో యానిమల్ నటుడు
కొద్దినెలల క్రితం బాలీవుడ్ నటుడు రాజీవ్ ఖండేల్వాల్.. తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినని బాంబు పేల్చారు. అలాగే యానిమల్ ఫేమ్ సిద్ధాంత్ కర్నిక్ సైతం తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఓ సినిమా ఛాన్స్ కోసం కో ఆర్డినేటర్‌ను కలవగా.. అతను రాత్రి 10.30 గంటలకు ఇంటికి రమ్మన్నాడని .. ఆ టైమ్‌లో పిలవడంతో తనకు విచిత్రంగా అనిపించిందని సిద్ధాంత్ అన్నారు. అతని ఇంటికి వెళ్లగా కెరీర్ ప్రారంభిస్తున్న దశలో రాజీపడాలని.. లేదంటే నీకు కష్టమేనని చెప్పాడని ఆ మాటలను బట్టి అతని ఉద్దేశం ఏంటో నేను గ్రహించి బయటికొచ్చేసినట్లు తెలిపాడు.

రణవీర్ సింగ్ కూడా
వీరే కాదు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బాదితుడే. కెరీర్ బిగినింగ్‌లో ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ తనను ఇంటికి పిలిచాడని.. నా పోర్ట్‌ఫోలియా ఇవ్వగా కనీసం చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కెరీర్‌లో ముందుకు సాగాలంటే ఏం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలని చెబుతూ.. తనను తాకేందుకు ప్రయత్నించాడని రణవీర్ తెలిపారు. అతని ఉద్దేశాన్ని గ్రహించి తాను నో చెప్పడంతో ఆ వ్యక్తి ఏడ్చాడని బాలీవుడ్ స్టార్ హీరో గుర్తుచేసుకున్నారు.
భోజ్‌పురిలో సూపర్‌స్టార్‌గా
ఇకపోతే.. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రవికిషన్. అక్కడ స్టార్ అయినప్పటికీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ తదితర భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రంలో విలన్ మద్దాలి శివారెడ్డిగా తెలుగువారిని పలకరించారు రవికిషన్. ఈ సినిమాతో ఆయనకు తెలుగులో అవకాశాలు క్యూకట్టాయి. సుప్రీం, రాధ, కిక్ 2, సాక్ష్యం, సైరా, హీరో, డాకు మహారాజ్ తదితర చిత్రాల్లో నటించి అలరించారు. సినీనటుడిగా ఉంటూనే గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు.
ఆమె రాత్రికి రమ్మంది
కెరీర్ ఆరంభంలో తాను క్యాస్టింగ్ కౌచ్ బారినపడినట్లు రవికిషన్ గుర్తుచేసుకున్నారు. రజత్ శర్మ నిర్వహించిన అప్ కీ అదాలత్ కార్యక్రమానికి హాజరైన రవికిషన్.. ఓ నటి తనను రాత్రి కాఫీకి ఆహ్వానించిందని, అయితే ఆమె మాటలు తేడా ఉన్నాయన్నారు. అప్పటికే ఆమె పేరున్న నటి అని.. పగటిపూట పిలిస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదని, కానీ ఆమె ఉద్దేశం వేరేలా ఉందని అర్ధమైందని ఆ వెంటనే ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించానని రవికిషన్ గుర్తుచేసుకున్నారు. ఎంత బలవంతం చేసినా ఆమె దగ్గరికి వెళ్లలేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











