RRR విడుదలైతే థియేటర్లను తగలబెడతారు.. రాజమౌళికి ఎంపీ హెచ్చరిక

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. చారిత్రాత్మక వీరులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ టీజర్ పై ఓ వర్గం వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ రాజమౌళిని హెచ్చరించారు.

 భీమ్ పాత్రపై అభ్యంతరాలు

భీమ్ పాత్రపై అభ్యంతరాలు


రియల్ క్యారెక్టర్స్ ను బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ కథగా సినిమాను రూపొందిస్తున్నట్లు రాజమౌళి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నట్లు టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. వాటికి భారీ స్థాయిలో రెప్పన్స్ కూడా వచ్చింది. అయితే అదే తరహాలో అభ్యంతరాలు కూడా వస్తున్నాయి.

బీజేపీ ఎంపీ హెచ్చరికలు

బీజేపీ ఎంపీ హెచ్చరికలు

ఇటీవల కొమురం భీమ్ వంశానికి చెందిన కొందరు కుటుంబ సభ్యులు RRRపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీజర్ లో అన్ని సీన్స్ బాగున్నప్పటికి ఒక్క టోపి పెట్టుకొని మైనారిటీకి చెందిన వ్యక్తిగా భీమ్ ని చూపించడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావ్ కూడా ఈ విషయంలో రాజమౌళికి హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆది వసూలు ఈ విషయంలో కోపంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

 తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము

తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము


బాపు రావ్ మాట్లాడుతూ.. వాస్తవానికి కొమురం భీమ్ దేనికోసం పోరాటం చేశారో.. దానికోసం సినిమాను చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎవరైతే హతమార్చరో వాళ్ళ దుస్తువుల్లోనే చూపించడం కరెక్ట్ కాదు. ఇతర మతస్తుడిగా చూపించడంపై మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ రోజు ఆ విధంగా టోపి పెట్టి ముస్లిం సోదరుడిగా చిత్రీకరించడం వలన ఆదివాసుల మనోభావాలను దెబ్బ తీసినట్లే అవుతుంది.

టీజర్ లో అది స్పష్టంగా కనిపిస్తోంది.

టీజర్ లో అది స్పష్టంగా కనిపిస్తోంది.

మేము రాజమౌళి గారిని ఒకటే హెచ్చరిస్తున్నాము. అలాంటి పాత్రలు కాకుండా..నిజమైన కొమురం భీమ్ ఆదివాసుల కోసం పేద ప్రజల కోసం పోరాటం చేసిన విషయల గురించి చూపించాలని కోరుకుంటున్నాం. వాస్తవానికి ఆది వాసులు ఏనాడు కూడా టోపి పెట్టుకోలేదు. టీజర్ లో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివాసులను ఒక విధంగా అవమాన పరిచే విదంగా ఉంది. ఈ విషయంలో మేము వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు.

Recommended Video

#RamaRajuForBheem : Komaram Bheem NTR Teaser, Jr.NTR RRR First Look | #BheemforRamaraju, #RRR
థియేటర్లను కూడా తగలబెడతాము

థియేటర్లను కూడా తగలబెడతాము

ఈ విషయంపై చర్చించడానికి రాజమౌళి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫోన్ నెంబర్ తీసుకున్నాం గాని అందుబాటులోకి అయితే రాలేదు. త్వరలోనే కలవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే సినిమాలో ఇదే విధంగా చూపిస్తే సినిమా థియేటర్లను కూడా ఆధివాసులం తగలబెడతామని రాజమౌళికి హెచ్చరిస్తున్నాము. వీలైనంత వరకు అలాంటి సన్నివేశాలు లేకుండా కొమురం భీమ్ ని చూపిస్తే బావుంటుంది.. అంటూ సోయం బాపు రావ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X