Thalapathy Vijay: దళపతి విజయ్‌కు ఆ పదవి? పొత్తుల్లో NDA నుంచి టీవీకే చీఫ్‌కు భారీ ఆఫర్?

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు ఎప్పటిలాగే బరిలో ఉండగా.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో, అన్నాడీఎంకేతో బీజేపీలు పొత్తు పెట్టుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి దళపతి విజయ్‌పైనే ఉంది. కోలీవుడ్ సూపర్‌స్టార్‌గా, రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్‌తో మూడు దశాబ్ధాలుగా వెలుగొందుతున్న విజయ్ తన సుధీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి దిగారు.

Also Read
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’

తమిళగ వెట్రి కజగం (టీవీకే)ను స్థాపించిన విజయ్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అగ్రనటుడు కావడంతో ఆయన రోడ్ షోలకు, బహిరంగ సభలకు భారీగా జనం పోటెత్తుతున్నారు. ఆయన క్రేజ్‌ నేపథ్యంలో తమిళ పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. విజయ్ ఎన్నికల్లో గెలవనప్పటికీ తన ఫ్యాన్ బేస్‌తో ఓట్లను చీల్చి తమ విజయావకాశాలను దెబ్బతీస్తారని ప్రధాన పార్టీలు భయపడుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్‌తో పొత్తు పెట్టుకునేందుకు వారు పావులు కదుపుతున్నారు.

BJP Offers Deputy CM Post To Thalapathy Vijay and 80 Seats To TVK As Alliance Talks for Tamil Nadu Polls 2026

నిన్న మొన్నటి వరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒంటరిగానే బరిలో దిగుతానని.. ఎవరితో పొత్తులు ఉండవని దళపతి విజయ్ తేల్చిచెప్పారు. అయితే కరూర్ తొక్కిసలాట, జననాయగన్ మూవీ విడుదల వాయిదా, త్రిషతో ఎఫైర్ రూమర్స్, భార్య నుంచి విడాకుల నోటీసుతో విజయ్ కాస్త ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఆర్ధిక వనరుల అంశం కూడా విజయ్‌ని భయపెడుతోంది. విజయ్‌కి భారీ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ.. పార్టీని నడిపించడం, ఎన్నికలను ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇదంతా డబ్బుతో ముడిపడిన వ్యవహారం. తనకున్న పరిమిత వనరులతో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి దిగ్గజాలను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. వాటి అంగ బలం, అర్ధబలం, సాధన సంపత్తి ముందు విజయ్ ఏమాత్రం నిలబడలేడు.

Recommended For You
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’

ఎన్నికలు ఎదుర్కోవాలంటే పార్టీ అభ్యర్ధులు నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని టీవీకే అంతర్గత చర్చల్లో అభిప్రాయపడినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే విజయ్ పార్టీలో ఉన్న నేతలు సామాన్య, మధ్యతరగతి వర్గాల వారే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారు పార్టీ కోసం ఖర్చు చేయడానికి ముందుకొస్తారా? అన్నది పెద్ద ప్రశ్న. దీంతో విజయ్ క్రౌడ్ ఫండింగ్ లేదా సొంత నిధులతోనే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

You May Also Like
నాన్నకి ఆ కోరిక తీర్చలేకపోయా... అంతా నా తలరాత... డిమోన్ పవన్ ఎమోషనల్
నాన్నకి ఆ కోరిక తీర్చలేకపోయా... అంతా నా తలరాత... డిమోన్ పవన్ ఎమోషనల్

అయితే విజయ్ ద్వారా తమిళనాడులో అధికారాన్ని అందుకోవాలని చూస్తోన్న భారతీయ జనతా పార్టీ.. ఆయనను ఎన్డీఏలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేక రకాల ఆయుధాలను ప్రయోగించింది. అయితే చివరి ప్రయత్నంగా విజయ్‌కి బీజేపీ అధిష్టానం బంపరాఫర్ ప్రకటించింది. పొత్తులో భాగంగా టీవీకేకు 80 అసెంబ్లీ సీట్లతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందట. అయితే ఈ ఆఫర్‌ పట్ల విజయ్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదని తమిళ మీడియా చెబుతోంది. తన పార్టీ సిద్ధాంతాలకు, బీజేపీ విధానాలకు ఏమాత్రం పొంతన లేదని.. అందుకే ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ ఇక్కడితో ఆగకపోవచ్చని.. విజయ్‌ని ఎలాగైనా ఎన్డీయేలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చే వరకు కొనసాగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేలలో విజయ్‌కి కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని తేలడంతో ఏ అవకాశాన్ని జారవిడవకూడదని బీజేపీ భావిస్తోంది. దీంతో తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

More from Filmibeat

Read more about: bjp thalapathy vijay mk stalin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X