రణం షూటింగ్‌లో ఘోర ప్రమాదం... ఇద్దరు మృతి
తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న రణం సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకొన్నది. షూటింగ్‌లో సిలెండర్ పేలడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. బెంగళూరులో జరిగిన ఈ ప్రమాద ఘటన అటు కన్నడ.. ఇటు తెలుగు సినిమా పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఈ చిత్రానికి కనకపుర శ్రీనివాస్ నిర్మాత కాగా, చేతన్ హీరోగా నటిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
మీడియా కథనాలు వెల్లడించిన ప్రకారం.. బెంగళూరులోని బాగలూర్ ఇండస్ట్రీయల్ ఏరియాలో కారు బ్లాస్ట్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారు. ఈ బ్లాస్ట్‌ను జరుపగా దానికి సంబంధించిన శకలాలు నలుగురికి తగిలాయి. ఈ ప్రమాదంలో సుమీర (28), ఆర్య (8) మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన తండ్రి, మరో చిన్నారిని బెంగళూరులోని అంబేద్కర్ హాస్పిటల్‌లో చేర్పించారు.

షూటింగ్‌లో బ్లాస్ట్‌కు అనుమతి లేదు
రణం షూటింగ్‌కు సంబంధించిన బ్లాస్ కోసం అనుమతులు తీసుకోకపోవడం మరో వివాదంగా మారింది. కర్ణాటక ఫైర్ సర్విసేస్ డీజీ ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ షూటింగ్ కోసం ముందస్తు అనుమతులు తీసుకోలేదు. బ్లాస్ట్‌కు సంబంధించిన సీన్ గురించిన షూటింగ్ అనుమతి లేదు అని చెప్పారు.

నాకు తెలియదు.. హీరో చేతన్
చేతన్ అహింస, చిరంజీవి సర్జా నటిస్తున్న రణం చిత్రానికి వీ సముద్ర దర్శకుడు. ఘటనపై చేతన్ స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన సమయంలో నేను అక్కడలేను. గురువారం జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాను. శుక్రవారం జరిగిన షూట్‌కు హాజరుకాలేదు. పేలుడు ఘటన దురదృష్టకరం. ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియదు అని అన్నారు.

నేను షూటింగ్‌లో లేను.. హీరో చిరంజీవి సర్జా
ఫైట్ సీక్వెన్స్ కోసం అనుమతి తీసుకోన్నారా అనే విషయం నాకు తెలియదు. నాకు సంబంధించిన షూటింగ్ ఆరు నెలలుగా క్రితమే పూర్తయింది. ఈ చిత్రంలో నాది అతిథి పాత్రే. ప్రమాదం జరిగిన సమయంలో మైసూర్‌లో ఉన్నారు. ఈ ప్రమాద ఘటన గురించి పూర్తిగా తెలియదు అని చిరంజీవి సర్జా తెలిపారు.


Click it and Unblock the Notifications











