NBK 109: బాలయ్యను ఢీ కొట్టడానికి సిసలైన యానిమల్… స్క్రీన్లు తగలడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ?

ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలకు ఓ స్టార్ హీరో విలన్ గా దొరికేశాడు. ఇప్పుడు ఏ పెద్ద సినిమా చూసిన ఆయనే విలన్ గా కనిపిస్తున్నారు. మొన్నటి వరకు బాలీవుడ్ సెన్సేషన్ హిట్ యానిమల్ సినిమాలో విలన్ గా చేసిన బాబీ డియోల్... ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోని హీరోలకు విలన్ గా మారాడు. ఇప్పటికే కంగువ చిత్రంలో విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్... ఇప్పుడు ఎన్బీకే 109 చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. చిత్ర బృందం బాబీ డియోల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే....

బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన చిత్రం యానిమల్. ఇక ఆ సినిమాలో రణబీర్ కపూర్ కు విలన్ గా ... బాబీ డియోల్ కనిపించాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాల్లో హీరోగా కనిపించిన ఆయన కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం విలన్ గా మారిపోయి సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నాడు.. ఇటీవల ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ చేసి.. మళ్లీ వెలుగులోకి వచ్చాడు. యానిమల్ సినిమాలో అబ్రార్ పాత్రలో నటించి ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో అలరించాడు.

Bobby Deol Birthday: Balakrishna NBK 109 Team Welcomes Aboard Bobby Deol Full Details Here

యానిమల్ సినిమాలో ఆయన్ని పూర్తి వైలెంట్ గా చూపించాడు సందీప్ రెడ్డి వంగా. కానీ ఎందుకు నటన విషయంలో పూర్తిస్థాయిలో వాడుకోలేదనే కామెంట్స్ వినిపించాయి. ఇక యానిమల్ క్రేజ్ తో ఆయనకు పలు సౌత్ సినిమాల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే సూర్యతో కలిసి చేస్తున్న కంగువ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం కంగువ.

ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే సూర్య పోస్టర్స్ రిలీజ్ కాగా.. ఆకట్టుకున్నాయి. ఇప్పుడు బాబీ డియోల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో బాబీ డియోల్ క్రూరంగా కనిపించారు. ఇదిలా ఉంటే... నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Bobby Deol Birthday: Balakrishna NBK 109 Team Welcomes Aboard Bobby Deol Full Details Here

ఇక ఈ సినిమాలో విలన్ గా బాబీడియోల్ అని... చాలాకాలం నుంచి ప్రచారం జరిగింది. కానీ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా లుక్ రిలీజ్ చేసి సినిమాలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్కమ్ ఆన్ బోర్డు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నందమూరి బాలకృష్ణకి ఆయన విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్.. బాలయ్యకు సమఉజ్జిని తీసుకువచ్చారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X