పవన్ కల్యాణ్ సినిమాలో మరో హీరో.. ఆ రాజు పాత్రతో రచ్చ చేసేందుకు రెడీ

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గతంలో లేని విధంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు ఒకేసారి పలు ప్రాజెక్టులను చేస్తూ ముందుకు వెళ్తోన్నాడు. ఇలా ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.

'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కు వరుసగా బ్రేక్‌లు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించి.. టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పాటు పోరాటాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ న్యూస్ లీక్ అయింది.

Bobby Deol Key Role in Harihara Veeramallu

క్రేజీ కాంబోలో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తోన్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ బాలీవుడ్‌ నుంచి పలువురు స్టార్లను తీసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో స్టార్‌ను కూడా ఎంపిక చేసుకున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. 'హరిహర వీరమల్లు' మూవీలో బాలీవుడ్‌కు చెందిన బాబీ డియోల్ కీలక పాత్రను చేస్తున్నారట. ఇందులో ఆయన ఓ రాజు పాత్రలో కనిపించబోతున్నారని.. ఆయనతో పవన్ కల్యాణ్‌కు భీకరమైన ఫైటింగ్ ఉంటుందని కూడా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Bobby Deol Key Role in Harihara Veeramallu

దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X