పవన్ మూవీ డైలాగ్ లీక్ చేసిన బాబీ.. కింగ్ కంటే హై రేంజ్ రోల్‌లో పవర్ స్టార్

టాలీవుడ్‌లోని ఏ హీరో చేయని విధంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు నాలుగు ప్రాజెక్టులను ఏకకాలంలో చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీలో యమ జోష్‌తో కనిపిస్తోన్న అతడు.. ఇప్పటికే కొన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు. అందులో 'హరిహర వీరమల్లు' మూవీ ఒకటి.

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Bobby Deol Leaks Harihara Veeramallu Movie Dialogue

వాస్తవానికి 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కు వరుసగా బ్రేక్‌లు పడ్డాయి. ఈ పరిస్థితుల్లో త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించి.. టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో మళ్లీ షూట్ బ్రేక్ పడింది.

పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తోన్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ బాలీవుడ్‌ నుంచి పలువురు స్టార్లను తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో బాలీవుడ్‌కు చెందిన బాబీ డియోల్ కీలక పాత్రను చేస్తున్నారు. ఇందులో ఆయన ఓ రాజు పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

Bobby Deol Leaks Harihara Veeramallu Movie Dialogue

బాబీ డియోల్ ప్రస్తుతం 'యానిమల్' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా 'హరిహర వీరమల్లు' మూవీలో ఆయన పవన్ కల్యాణ్‌తో 'బాద్‌షా బేగం మా ప్రాణం. మా ప్రాణాన్ని కాపాడు. మీకేమి కావాలో కోరుకుంటే అవి ఇచ్చేస్తా' అని చెప్పిన డైలాగ్‌ను లీక్ చేశారు. తద్వారా రాజు కంటే పవర్‌ఫుల్ పాత్రలో పవన్ నటిస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X