రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్‌కు మెగా ఆఫర్.. చిరంజీవితో ఛాన్స్..

టాలీవుడ్ లో గత కొద్దిరోజులుగా ఒక చిన్న సినిమా పెద్ద చర్చగా మారింది. అదే 'రాజు వెడ్స్ రాంబాయి'. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ప్రేమకథ చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ సెన్సేషన్ గా మారింది. రోజురోజుకు భారీ హైప్ క్రియేట్ చేస్తూ.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి పేరు మారుమోగుతుంది. ఈ సెన్సేషన్ సక్సెస్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం కొట్టేశాడు. వివరాల్లోకెళ్తే..

'రాజు వెడ్స్ రాంబాయి' చిన్న సినిమా.. భారీ విజయం.. డైరెక్టర్ సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా.. వేణు ఉడుగుల నిర్మించారు. అఖిల్ రాజ్ ఉద్దేమారి, తేజస్వి రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆశించిన దానికంటే మంచి ఫలితాలను సాధించి, బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సాధారణంగా చిన్న సినిమాలు మొదటి వారం తర్వాత కుదేలవుతాయి. కానీ 'రాజు వెడ్స్ రాంబాయి' మాత్రం వేరే స్టోరీ. విడుదలైన మూడు రోజులకే ₹7.5 కోట్ల గ్రాస్ ను రాబట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందుకోవడం గమనార్హం.

Bobby Kolli Offers Raju Weds Rambai Director Sailu Kampati a Key Role in Chiranjeevi s Mega 158

చిన్న బడ్జెట్, కొత్త ముఖాలు.. అయినప్పటికీ కంటెంట్, ఎమోషన్స్, మ్యూజిక్ కలిసి సినిమాను హైలెట్ చేశాయి. ఐదో రోజు కూడా కలెక్షన్లు పడకుండా, తొలి రోజులాగా వసూళ్లు రావడం సినిమాకు ఉన్న క్రేజ్‌కి నిదర్శనం. ఇప్పటి వరకు ఈ మూవీ ఇండియా గ్రాస్ ₹9 కోట్లు దాటింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. రాబోయే వారం కూడా సినిమా మంచి వసూళ్లు అందుకోవచ్చు.

బాబీ కొల్లి బంపర్ ఆఫర్
ఈ నేపథ్యంలోరాజు వెడ్స్ రాంబాయి మూవీ మేకర్స్ సక్సెస్ మీట్‌ నిర్వహించారు. ఈ సినిమాకు హాజరైన అతిథులలో హిట్ దర్శకుడు బాబీ కొల్లి (KB Bobby) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన స్టేజ్ పై ప్రకటించిన మాటలు మాత్రం సరిగ్గా "చిన్న సినిమా - పెద్ద టర్నింగ్ పాయింట్" అన్నట్టుగా మారాయి. "నెక్స్ట్ నేను మెగాస్టార్ చిరంజీవిగారితో చేస్తున్న సినిమాలో నువ్వు ఒక పాత్ర చేయాలి తమ్ముడు." అంటూ డైరెక్టర్ సాయిలు కంపాటికి ఆఫర్ ఇచ్చారు.

దీంతో సాయిలు కంపాటి ఒక్కసారిగా ఎగిరి గంతేసినట్టు ఆనందంతో ఆ ఆఫర్‌ను అంగీకరించారు. సాధారణ కళాకారుడికై చిరంజీవి గారితో వర్క్ చేయడం ఓ కల.. అలాంటి వ్యక్తి తో కలిసి పనిచేసే ఆఫర్ వస్తే.. వద్దంటారా? అలా డైరెక్టర్ సాయిలు కూడా వెంటనే అంగీకరించినట్టు అర్థమవుతుంది. రాజు వెడ్స్ రాంబాయి మూవీకి లిరిక్స్ రాసిన మిట్టపల్లి సురేందర్ ను మెగాస్టార్ సినిమా #Mega158 కోసం పాట రాయడానికి అవకాశం ఇస్తున్నట్లు బాబీ ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా దూసుకెళ్తోంది. దీని తరువాత చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో Mega 158 సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీ కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. తమన్ మూవీకి సంగీతం అందించబోతున్నారు.

మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. మాళవిక నాయర్ , హీరో కార్తీ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారట. కానీ, ఈ వార్తలపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి - బాబీ కాంబినేషన్ ముందే వాల్తేరు వీరయ్య ద్వారా భారీ విజయాన్ని సాధించింది. అదే నమ్మకంతోనే మెగాస్టార్ మరోసారి బాబీకి అవకాశం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X