ఫ్యాన్స్ కోసం అలా చేసే హీరో .. బాబీ సింహా కామెంట్స్

తమిళ భాషలో విలక్షణమైన పాత్రలను చేస్తూ బాబీసింహా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రతి నాయకుడిగా తనదైన శైలిలో ముద్ర వేసి బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. జిగర్తాండ (తెలుగు గద్దలకొండ గణేష్)లో బాబీ సింహా నటనకు అక్కడి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్‌లో కూడా విలన్ రోల్స్ వేసినా అంత పేరును తీసుకురాలేదు. అలాంటి బాబీ సింహా.. రవితేజ హీరోగా వస్తోన్న డిస్కోరాజా చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు.

డిస్కోరాజా ప్రమోషన్స్‌లో భాగంగా బాబీ సింహా.. సూపర్ స్టార్ రజినీ గురించి ప్రస్థావించాడు. మొదటి నుంచి కూడా తాను రజనీకాంత్ అభిమానినే అని పేర్కొన్నాడు. ఆయనతో కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపించినా చాలు అనుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అలాంటిది ఆయనతో కలిసి 'పేట'లో నటించే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజు తనకు ఆ సినిమాలో పెద్ద వేషమే ఇచ్చాడని తెలిపాడు.

Bobby Simha ABout RajiniKanth Acting Style In Fan View

ఒక అందమైన అమ్మాయిని అబ్బాయిలు ఎలా గమనిస్తూ వుంటారో.. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు రజనీ సార్‌ను అలా గమనించేవాడినని చెప్పుకొచ్చాడు. కథ .. కథనం .. తన పాత్రను గురించి మాత్రమే కాకుండా, ఒక సీన్లో ఎలా చేస్తే తన ఫ్యాన్స్‌కి నచ్చుతుందనే విషయాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని చేస్తారని తెలిపాడు. అలా ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని చేసే విధానాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X