ప్రభాస్‌తో ఎప్పుడో రొమాన్స్ చేయాల్సింది... షాకింగ్ న్యూస్ చెప్పిన క్రేజీ బ్యూటీ
మామూలుగా మంచి బోల్డ్ అండ్ హాట్ హీరోయిన్స్ టాపిక్ వస్తే డెఫినెట్‌గా నార్త్ నుంచే పలువురు టాప్ హీరోయిన్స్ మనకి కనిపిస్తారు. కాగా వీరికి చెక్ చెప్పేలా మన సౌత్ నుంచి కూడా కొందరు హీరోయిన్స్ తమ అందాల ఆరబోతతో గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్స్‌లో తమిళ నటి మాళవికా మోహనన్ కూడా ఒకరు.
మాళవిక హీరోయిన్‌గా తమిళ్‌లో పలు సినిమాలు చేసింది. కానీ తనకి మరీ అంత బ్రేక్ ఇచ్చినవి కానీ తాను మరీ అంత ఎక్కువ హాట్ ఎక్స్ పోజింగ్ చూపించిన సినిమాలు కానీ లేవు. అయినప్పటికీ మాళవిక క్రేజ్ గట్టిగానే ఉంది. దానికి కారణం తన సోషల్ మీడియా ద్వారా అందించే ట్రీట్ అని చెప్పాలి. సినిమాల్లో చూపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మాళవిక హాట్ షోతో రెచ్చగొడుతూ ఉంటుంది.

ఇలా మొత్తానికి కెరీర్‌లో బిగ్ ఆఫర్స్ ఇపుడు చేతిలో పెట్టుకొని దూసుకెళ్తోంది మాళవిక. ఈమె తెలుగులో మొట్టమొదటి సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన "ది రాజా సాబ్"లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమెకి ఇదే తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ ఇంట్రెస్టింగ్‌గా దీనికంటే ముందే ఓ సినిమా అది కూడా ప్రభాస్‌తోనే మిస్ అయ్యినట్టుగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాళవిక ఆవేదన వ్యక్తం చేసింది.
మరి ప్రభాస్‌తో ఆమె మిస్ చేసుకున్న సినిమా ఏదో కూడా కాదు గత ఏడాది వచ్చి అదరగొట్టిన క్రేజీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం "సలార్" అట. దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదట ప్రభాస్ తో సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు కానీ అప్పుడు వేరే సినిమాలు మూలాన తాను ఆ సినిమా చెయ్యలేకపోయాను అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. అలా ప్రభాస్ తో తాను చేయాల్సిన మొదటి సినిమా అలాగే తెలుగులో కూడా తనకి అదే మొదటి చిత్రం కావాల్సింది అంటూ అసలు విషయం రివీల్ చేసింది మాళవిక.

అంటే నీల్.. శృతి హాసన్ కంటే ముందు ఈ హాట్ బ్యూటీని ప్రభాస్ సరసన అనుకున్నారని చెప్పొచ్చు. మరి ఆలోచిస్తే శృతి హాసన్ చేసిన రోల్ లో మాళవిక కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిపోతుంది. అది మిస్ అయ్యినా కూడా ఇపుడు దానికి డిఫరెంట్ గా మంచి ఎంటర్టైనర్ , అది కూడా ప్రభాస్‌తో రొమాంటిక్ సీన్స్ కూడా చేసే సినిమానే పట్టేసింది. ఈ సినిమాతో తెలుగులో మంచి డెబ్యూ అందుకోవాలని మాళవిక చూస్తుంది. మరి చూడాలి.. మాళవికకి తెలుగులో ఎలాంటి వెల్కమ్ దక్కుతుంది అనేది. ఇవి పక్కన పెడితే ఈమె ఈ ఏడాదిలోనే "యుధ్ర" అనే సినిమాలో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడా ప్రమోషన్స్ తో హీట్ పుట్టించింది.


Click it and Unblock the Notifications











