షెకావత్ సార్ పై బోల్డ్ అండ్ హాట్ బ్యూటీ.. బన్నీని అస్సలు పట్టించేకోలేదుగా
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుత తరంలో నటన పరంగా ది బెస్ట్ ఇచ్చే నటీనటులు చాలా అరుదుగా ఉన్నారని చెప్పాలి. సినిమాలో కాన్సెప్ట్‌లు డామినేషన్ ఎక్కువ కనిపిస్తూ నటీనటుల పెర్ఫామెన్స్‌లకి స్కోప్ తగ్గిపోవడం వంటివి మనం మిస్ అవుతున్నాం అనే భావన సినీ ప్రేమికుల్లో చాలా మందికి కనిపిస్తుంది.
కానీ ఒక్కో సినీ పరిశ్రమలో ఒక్కో వెర్సటైల్ నటుడు ఉన్నట్టుగా మన తెలుగు సినిమా సహా తమిళ్, హిందీ మలయాళ సినిమాల్లో కూడా కొందరు ఉన్నారు. ఇలా మలయాళ సినిమాలో కనిపించిన నటనతో ఇంప్రెస్ చేసే మంచి పొటెన్షియల్ ఉన్న నటుల్లో ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఒకరు. కాగా మలయాళ చిత్ర పరిశ్రమలో తన విలక్షణ నటన కనబరిచి సౌత్ లో మంచి పేరు తాను తెచ్చుకున్నారు.

అలా తమిళ్‌లో విక్రమ్, మన తెలుగులో అయితే పుష్ప సినిమాలో విలన్‌గా కనిపించి దుమ్ము లేపేశారు. దీనితో తన పెర్ఫామెన్స్‌ని ఇష్టపడేవారు ఇంకా ఎక్కువ అయ్యారు. భన్వర్ సింగ్ షెకావత్ అంటూ పుష్ప సినిమాలో అదరగొట్టిన ఫాఫా కోసం పార్ట్ 2లో కూడా చూద్దామని చాలా మంది ఎదురు చూసారు.
పార్ట్ 1లోనే తన సైకోయిజం ఓ రేంజ్ లో చూపిన ఫాఫా పార్ట్ 2 ల్లో మాత్రం డిజప్పాయింట్ చేసాడు అని చాలా కామెంట్స్ వినిపించాయి. కాకపోతే అది తన తప్పు కాదు.. సినిమాలో తన రోల్ ఇంకా బాగుండు అని మేకర్స్ వైపే తప్పు కనిపించింది. అయితే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ ఎంట్రీ మాత్రం డెఫినెట్ గా ప్రతీ ఒక్కరికీ మెంటల్ ఎక్కిస్తుంది.
సుకుమార్ ... ఫహద్ అతన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. అయితే హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యిపోతు ఫహద్ కోసం ఒక మ్యాడ్ పోస్ట్ ని చేసింది. కాగా ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆ మధ్య తన బోల్డ్ పిక్స్ అండ్ అడల్ట్ కంటెంట్ వీడియోతో సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసిన యంగ్ బ్యూటీ రుహాణి శర్మ.
తన హాట్ నెస్ తో, బోల్డ్ షోతో హీటెక్కించే ఈ యంగ్ బ్యూటీ పుష్ప 2 లో ఫహద్ పై ప్రశంసలు కురిపించింది. ఇంతకీ ఆమె ఏమంటుంది అంటే నేను ఫహద్ ఎంట్రీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. నా పక్కనే ఉన్న నా తమ్ముణ్ణి కూడా అడిగాను ఫాఫా వచ్చాడా లేదా అని.. తన ఎంట్రీని అయితే నేను అసలు పోల్చుకోలేకపోయాను అంతలా తన పాత్రలో ఫాఫా ఒదిగిపోయారు.

సినిమాలో తన ప్రతీ సీన్ కి నాకు గూస్ బంప్స్ వచ్చాయి.. ఎప్పటి నుంచో మిమ్మల్ని నేను ఎంతగానో ఆరాధిస్తున్నాను, మీతో వర్క్ చెయ్యాలని ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను. కానీ బిగ్ స్క్రీన్స్ పై మిమ్మల్ని చూసినపుడు అదొక ట్రీట్ లా ఉంటుంది. మిమ్మల్ని ఎవరూ మ్యాచ్ చెయ్యలేరు. మీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయింది. కానీ ఇన్ని చెప్పిన ఈమె ఇదే పుష్ప 2 లో క్రేజీ పెర్ఫామెన్స్ ఇచ్చిన హీరో అల్లు అర్జున్ గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం అనేది మాత్రం షాకింగ్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











