Kannappa: 15 మంది స్టార్ నటులతో కన్నప్ప.. విష్ణు కోసం టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ హీరో!

నటప్రపూర్ణ, డాక్టర్ మంచు మోహన్ బాబు వారసుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2003లో విష్ణు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతను అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ చాలా కాలంగా ఈయన సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. చేసినవి కూడా ఫ్లాప్ కావడంతో.. తెరమరుగయ్యారు. కానీ ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో ఓ అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ముఖ్యంగా దివంగత నటుడు కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్త కన్నప్ప చిత్రాన్ని కన్నప్పగా మలిచి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను పాన్ ఇంజియా లెవెల్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే దేశంలోని అన్ని సినీ రంగాల నుంచి స్టార్ నటీనటీలను తీసుకు వస్తూ ఇందులో నటించేలా చేస్తున్నారు. మొత్తం 15 మంది స్టార్ సెలబ్రిటీలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు కన్నప్ప సినిమాతో తొలిసారి తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bolllywood Star Hero Entry to Tollywood For Manchu Vishnu Kannappa Movie Check Details

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను వంద కోట్ల రూపాయల భారీ బడ్డెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ద్వారా నిర్మించబోతున్నారు. పరుచూరి గోపాల కృష్ణ , ఈశ్వర్ రెడ్డి, జి. నాగేశ్వర రెడ్డి , తోట ప్రసాద్‌లు డెవలప్ చేసిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ రోల్ లో మంచు విష్ణు కనిపించబోతున్నారు. భారీ ఎత్తున తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు కనిపించనున్నారు.

ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. నేరుగా అక్షయ్ కుమార్ యే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారు. ఆయన మాత్రమే కాకుండా మరో 14 మంది స్టార్ నటులు కూడా ఈ చిత్రంలో భాగంగా కాబోతున్నారు.

Bolllywood Star Hero Entry to Tollywood For Manchu Vishnu Kannappa Movie Check Details

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, మంచు మోహన్ బాబు, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, రాహుల్ మాధవ్, దేవరాజ్, నయనతార, ప్రీతి ముకుందన్, ఐశ్వర్యాభాస్కరన్, మధుబాల, జోషితా అనోలాలు కనిపించనున్నారు. అలాగే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మండ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదే విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఇంత మంది స్టార్ లు కనిపిస్తుండగా.. సినిమాపై భారీగానే అంచనాలు నమోదు అయ్యాయి. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X