అన్నింట్లో మంచు విష్ణునే.. కన్నప్ప తెర వెనుక కథ చెప్పిన అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఓవైపు హౌజ్ ఫుల్ 5 కామెడీ థ్రిల్లర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబోతూనే ఉన్నారు. ఇక మరికొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'కన్నప్ప' చిత్రంతో అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ఇక ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. ప్రస్తుతం నార్త్ లో ప్రమోషన్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మంచు విష్ణు గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. కన్నప్ప చిత్ర నిర్మాణ విషయంలో మంచు విష్ణు ప్రవర్తన ఇలా ఉండేదని చెప్పుకొచ్చారు.
భారీ బడ్జెట్ తో రూపొందిన కన్నప్ప..
మంచు ఫ్యామిలీ నుంచి తొలిసారిగా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్రం కన్నప్ప. ఏకంగా ఈ చిత్ర నిర్మాణానికి టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించారు. అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో రూపుదిద్దుకుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దుమ్ములేపుతున్న స్టార్స్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారు.

మంచు విష్ణుపై అక్షయ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ప్రస్తుతం కన్నప్ప చిత్రం నార్త్ ఇండియా ప్రమోషన్స్ ను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. హిందీ మార్కెట్ ను టార్గెట్ చేసిన మేకర్స్ అక్కడే ప్రస్తుతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అక్షయ్ కుమార్, మంచు విష్ణు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ సినిమా గురించి చాలా విషయాలు చెబుతూ మంచు విష్ణుపైన కూడా ప్రశంసలు కురిపించాడు.
మంచు విష్ణు కేవలం తన పనివరకు చూసుకోకుండా ఇతరులకు కూడా సహకరిస్తారని చెప్పారు. ఆయనకు సాంగ్స్, డబ్బింగ్, ఎడిటింగ్, ఆర్ఆర్, స్క్రిప్ట్ వర్క్ విషయంలోనూ అవగాహన ఉందని, కన్నప్ప విషయంలో అన్నింట్లో దూకుడుగా పనిచేశారని చెప్పారు. ఇక కన్నప్ప చిత్రం కోసం మంచు విష్ణు 10 ఏళ్లు కష్టపడుతున్నారని, ఓవైపు 8 చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కన్నప్పపై విశ్వాసంగా ఉన్నారని, చాలా మంచి అవుట్ పుట్ ను అందుకుంటారని ఆకాంక్షించారు. మంచు విష్ణుకు కన్నప్ప చిత్రం విషయంలో ఉన్న డెడికేషన్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని తెలిపారు.
ట్రైలర్ విడుదల తర్వాత..
కన్నప్ప చిత్రంతో మంచు విష్ణు భారీ విజయాన్ని అందుకుంటారని మంచు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీ తారాగణం నటించడంతో పాటు హిందీలో మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఆ మధ్యలో వదిలిన టీజర్, శివయ్య సాంగ్ తో హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇటీవల వచ్చిన ట్రైలర్ తో మరింత గా అంచనాలు పెరిగిపోయాయి. జూన్ 27న ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఓవర్సీస్ లో ఇంగ్లీష్ వెర్షన్ లోనూ విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











