హరిహర వీరమల్లులో లెజెండరీ యాక్టర్.. పవన్ మూవీలోకి ఎంట్రీ
Hari Hara Veera Mallu: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా విడుదలంటే.. థియేటర్లలో ఫ్యాన్స్ పెద్ద పండగే. ప్రస్తుతం పాలిటిక్స్ బిజీబిజీ అయినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వాస్తవానికి పవర్ స్టార్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా ప్రకటించి దాదాపు మూడేండ్లు దాటింది.
ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్టేడ్ వచ్చింది.
17వ శతాబ్దానికి చెందిన కథతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' (Harihara Veeramallu)పై హై ఎక్స్పర్టేషన్ ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తరువాత పలు కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ స్థానంలోకి జ్యోతికృష్ణ ఎంట్రీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. తాజాగా ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ నుంచి మరో బిగ్ అప్టేట్ వచ్చింది. ఈ సినిమాలో లెజెండరీ నటుడు, బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ (Anupam kher)నటించబోతున్నారట. ఈ మూవీలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారట. పవర్ స్టార్ తో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్కీన్ షేర్ చేయడం ఇదే తొలిసారి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కె సన్నివేశాలు సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయని మూవీ మేకర్స్ చెబుతున్నారు. పవర్ సార్ట్ మూవీ కెరీర్ లో 'హరి హర వీరమల్లు' మూవీ ఓ మైలు స్టోన్ గా నిలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల జ్యోతి కృష్ణ 'హరి హర వీరమల్లు' చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకొని, సినిమాపై అంచనాలను పెంచే ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రత్యేక టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో, రెట్టింపు ఉత్సాహంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానెర్ పై ఎ.దయాకర్ రావు ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో సినీయర్ యాక్టర్ తోట తరణి, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ వంటి స్టార్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. అతి త్వరలోనే మిగిలిన సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీని రెండు భాగాలుగా రూపుదిద్దించనున్నారు.


Click it and Unblock the Notifications











