Natasa Stankovic: మొగుడ్ని వదిలేసి బాయ్ ఫ్రెండ్ తో చిల్.. హార్దిక్ పాండ్యా మాజీ భార్య వీడియో వైరల్‌

Natasa Stankovic: బాలీవుడ్ హాట్ బ్యూటీ మోడల్ నటాషా స్టాంకోవిక్, టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారు తన వివాహబంధాన్ని తెంచుకున్నారు. ఈ విషయం గత కొంతకాలం సీక్రెట్ గా పెట్టిన ఈ అంశంపై హార్దిక్ ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చారు.ఈ వ్యవహారం తరువాత హాట్ బ్యూటీ నటాషా స్టాంకోవిక్ దాదాపు రెండు నెలలు పాటు మొకం చాటేసింది. తాజాగా ఈ అమ్మడు ఓ బాయ్‌ఫ్రెండ్ తో ఇండియాకు వచ్చింది. వీరిద్దరూ క‌లిసి ముంబయి వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇంతకీ ఆ బాయ్ ఎవరు? మీరు కూడా ఓ లూక్కేయండి.

బాలీవుడ్ హాట్ బ్యూటీ, మోడల్ నటాషా స్టాంకోవిక్ దాదాపు రెండు నెలలు సెర్బియాలో గడిపిన తర్వాత ఇటీవల భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం మోడల్ నటాషా స్టాంకోవిక్ ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించింది. అదికూడా తన బాయ్ అలెగ్జాండర్ ఇలాక్ తో.. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని ముంబాయి వీధుల్లో తిరుగుతూ చిల్ అవుతున్నారు. ఈ తరుణంలో ఈ బ్యూటీ తన ఇండియా టూర్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో నటాషా కారులో డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. ఆమె బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తన పక్కన కూర్చున్నట్లు చూడొచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. ఇంతకీ ఈ బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఎవరనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

bollywood Actor former wife of cricketer Hardik Pandya Natasa Stankovic her boy friend Aleksandar Ilac in Mumbai A video of her outing was shared on social media

అలెగ్జాండర్‌తో ఈ బ్యూటీ కలిసి కనిపించడం తొలిసారి కాదు. నటాషా, హార్దిక్ విడిపోతున్నారనే పుకార్ల నేపథ్యంలో వీరిద్దరూ మీడియా కంటబడ్డారు. ఆ సమయంలో అలెగ్జాండర్ చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. నటాషా, హార్దిక్ లు విడిపోవడానికి అతడే కారణమని చాలా మంది కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో హార్దిక్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కూడా. అయితే.. అలెగ్జాండర్ దిశా పటానీ ప్రియుడు అనే రూమర్స్ కూడా ఉన్నాయి.

మరో వైపు వరల్డ్ కప్ హీరో, తన మాజీ హార్థిక్ ను నటాషా కలుస్తుందా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. నటాషా ఇంతకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ముంబైకి వచ్చినట్లు ప్రకటించింది. ఆ సమయంలో ముంబాయ్ లో ఆమె కార్ డ్రైవ్ చేసిన వీడియోను షేర్ చేసుకున్నారు. ఈ మెడల్, తన భర్త హార్దిక్ పాండ్యా నుండి విడిపోతున్నట్లు ప్రకటించే ముందు తన కుమారుడు అగస్త్యతో కలిసి సెర్బియాకు వెళ్లింది. ఆమె తన కొడుకు అగస్త్య నాల్గవ పుట్టినరోజును సెర్బియాలో తన కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రెట్ చేసింది. ఈ సెలబ్రెషన్స్ సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విషయం తెలిసిందే.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తమ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యాన్స్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ కండక్ట్ చేస్తూ..తన పర్సనల్ లైఫ్ లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటుంది. నటాషా స్టాంకోవిచ్ టీవీ యాడ్స్‌ తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ప్రకాష్ ఝా సత్యాగ్రహంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో ఆమె ఒక్క పాటలో మాత్రమే కనిపించింది. తర్వాత ఈ బ్యూటీ డిష్కియాన్, యాక్షన్ జాక్సన్, 7 అవర్స్ టు గో, జీరో వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X