బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. రాజీవ్ కపూర్ కన్నుమూత
బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది.రిషి కపూర్, రణధీర్ కపూర్ యొక్క సోదరుడు రాజీవ్ కపూర్ ఫిబ్రవరి 9 మంగళవారం కన్నుమూశారు. నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుజున్న రాజీవ్ ను అందరూ ముద్దుగా చింపు అని పిలిచేవారు. ఇక ఆయన 58 సంవత్సరాల వయసులో కన్నుమూయడం అభిమానులను కలచివేసింది.
మంగళవారం మధ్యాహ్న సమయంలో గుండెపోటు రావడంతో చెంబూర్ లోని వారి నివాసానికి సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. అయితే వైద్యం అందించే క్రమంలోనే అతను కన్నుమూశారు. ఒక్కసారిగా కపూర్ ఫ్యామిలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గత ఏడాది ఏప్రిల్ లో రిషి కపూర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక రణధీర్‌ను మీడియా సంప్రదించగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు, "నేను నా తమ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. అతను ఇక లేడు. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేసినా అతన్ని రక్షించలేకపోయాము. " "నేను ఆసుపత్రిలో ఉన్నాను, అతని బాడీ కోసం వెయిట్ చేస్తున్నాను' అంటూ.. వివరణ ఇచ్చారు.
రాజీవ్ కపూర్ 'రామ్ తేరి గంగా మెయిలీ' (1985), 'ఏక్ జాన్ హై హమ్' (1983) చిత్రాలలో నటించారు. రిషి కపూర్ కథానాయకుడిగా నటించిన 'ప్రేమ్ గ్రంథ్' సినిమాకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. రాజీవ్ కపూర్ సోదరి నీతు కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సంతాపం తెలిపారు. అలాగే బాలీవుడ్ కు చెందిన అగ్ర సినీ తారలు కూడా రాజీవ్ ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











