Bhediya Movie: కాంతార తరువాత తోడేలు.. మరో డబ్బింగ్ సినిమాతో అల్లు అరవింద్
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఎలాంటి సినిమాను తరుపైకి తీసుకువచ్చిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అందుకునేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన గీత ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ను కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల కాంతార సినిమాను తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు ఆడియోన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ మార్కెట్ వద్ద ఆ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. అయితే ఇప్పుడు గీత ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ తోనే మరొక హిందీ డబ్బింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు.
వరుణ్ ధావన్ నూతన చిత్రం భేడియా, హిందీ, తమిళం అలాగే తెలుగులో పాన్ ఇండియా తరహాలో నవంబర్ 25 న 3D వెర్షన్ లో రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను తోడేలు టైటిల్ తో విడుదల చేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. హారర్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రీసెంట్ గా చిత్ర యూనిట్ సభ్యులు చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. ఇక సినిమాలోని నటీనటులు టెక్నీషియన్స్ ఇప్పుడు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా భేడియా సినిమాను విడుదల చేస్తుండడం విశేషం. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో వరుసగా సరికొత్త సినిమాలను విడుదల చేస్తోంది.
కన్నడ సినిమా కాంతార తెలుగు వెర్షన్ ను కూడా అల్లు అరవింద్ విడుదల చేశారు. ఆ సినిమా సక్సెస్ అనంతరం ఇప్పుడు మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను విడుదల చేస్తున్నారు. వరుణ్ ధావన్ ఎక్కువగా కామెడీ సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేస్తున్నాడు. ఇక అతనికి దేశమంతా అభిమానులు ఉన్నారు. ఇక అతను మొదటిసారి భేడియా సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాను జియో స్టూడియోస్ అలాగే దినేష్ విజన్ ప్రెజెంట్ బ్యానర్లలో నిర్మించారు.


Click it and Unblock the Notifications











