Aishwarya Rai Bachchan: ఐశ్వర్యరాయ్ కారు‌కు ప్రమాదం.. స్పాట్‌కి పోలీసులు, కారులో ఎవరెవరంటే?

బాలీవుడ్ అగ్ర నటి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందన్న వార్తలతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ముంబైలోని ఐష్ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సును ఢీకొట్టినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఐష్ సురక్షితంగానే ఉన్నారని.. ప్రమాద సమయంలో ఆమె కారులో లేరని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.

బాలీవుడ్ షాదీ.కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత భద్రత సిబ్బండి కారులోనే ఉన్నారు. అయితే కారుకు ఎలాంటి నష్టం జరగలేదని, కాసేపటి తర్వాత ఐశ్వర్యరాయ్ కారు ఘటనాస్థలి నుంచి బయల్దేరిందని బాలీవుడ్ షాదీ తెలిపింది. ప్రమాద సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో కనిపించలేదు. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న ఐశ్వర్య అభిమానులు భయాందోళనకు గురయ్యారు. తమ అభిమాన నటి క్షేమంగానే ఉన్నారని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Bollywood Actress Aishwarya Rai Bachchan s car ramped by bus in Mumbai

5050 నెంబర్ గల ఐష్ కారు ముంబై వాసులకు సుపరిచితమే. హై ఎండ్ టయోటా వెల్‌ఫైర్ కారును ఐశ్వర్య వాడుతున్నారు. దీని ధర రూ.1.30 కోట్ల పైమాటే. వెంటిలేటెడ్ స్పెషల్ సీట్లతో , లగ్జరీ ఇంటీరియర్‌లకు ఈ కారు ఫేమస్. ఐష్‌తో పాటు బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు కూడా ఈ కారును వినియోగిస్తున్నారు. ఈ సంఘటన హై ప్రొఫైల్ వ్యక్తులు వారి సాధారణ ప్రయాణాల సమయంలో ఎదుర్కొంటున్న ప్రమాదాలను చెబుతోంది. వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు రోడ్డుపై అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన తెలియజేస్తోంది.

మంగళవారం జరిగిన మరో ఘటనలో ప్రముఖ నటుడు, రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ సతీమణి సోనాలి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాగపూర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో సోనాలి అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు బాలీవుడ్‌లోని మెరుపులతో పాటు భద్రతను కూడా గుర్తుచేస్తూ.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన, నివారణ చర్యల అవసరాన్ని చెబుతున్నాయి. సెలబ్రెటీ అయినా, సామాన్యుడైనా ప్రమాదాలు ఎవరికైనా ఎప్పుడైనా జరగొచ్చని ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతకుముందు అశుతోష్ గోవారికర్ కుమారుడు కోణార్క్ గోవారికర్ వివాహానికి ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ దంపతులు హాజరయ్యారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఐష్ - అభిషేక్‌లు జంటగా ఈ కార్యక్రమానికి రావడంతో గత కొద్దికాలంగా వీరి వివాహ బంధం చుట్టూ జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయ్యింది. అభిషేక్ క్రీమ్ షేర్వాణీలో, ఐశ్వర్య క్రీమ్ సూట్‌లో సందడి చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X