వింత సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?
Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిల్మీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు అలియా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ అమ్మడు ఓ వింత సమస్యతో పడపడుతున్నడంట. ఇంతకీ ఆ సమస్యేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
అలియా భట్ 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమా అట్లర్ ఫ్లాప్ అయినా వెనకడుగు వేయకుండా భిన్నమైన కంటెంట్ ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం అలియా భట్ బాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్ జాబితాలో పేరు దక్కించుకుంది. అత్యంత పారితోషికం అందుకుంటోన్న వారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె. ఈ మల్లీ టాలెంట్ హీరోయిన్ ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోఅలరిస్తోంది అలియా భట్.

తాజాగా తను నటించిన 'జిగ్రా'తో ప్రమోషన్స్ లో భాగంగా ఈ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ లో మాట్లాడింది. ఈ ప్రోగ్రామ్ లో అలియ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా తాను ఓ వింత సమస్యతో బాధపడుతున్నానని తొలిసారి బహ్య ప్రపంచానికి వెల్లడించారు. తాను అటెన్షన్ డిఫిసిట్ డిజాస్టర్ ( ADD)అనే సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. ఈ సమస్య కారణంగా తాను ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతానని వెల్లడించారు. అటెన్షన్ డిఫిసిట్ డిజాస్టర్ సమస్య వచ్చినపుడు కాస్త ఆందోళనగా ఉంటుందన్నారు. ఇలా ఇబ్బందిగా ఉన్నప్పుడూ కాస్తా రిలీఫ్ గా కూర్చోని ఊపిరి పీల్చుకుంటే.. నార్మల్ పోజిషన్ కు వస్తానని తెలిపింది..
ఈ సమస్య గురించి తెలుసుకున్న తన భర్త రణ్ బీర్ కపూర్ కూడా తనకి సపోర్టుగా నిలుస్తున్నారనీ, తన పట్ల ఆయన ఎంతో శ్రద్ద తీసుకుంటారని పేర్కొంది అలియా. అలాగే రాహా పుట్టినప్పుడూ తన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయకపోతే.. అందరూ ఏమని అనుకుంటారో అని కాస్త అసౌకర్యంగా అనిపించిందని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడూ తాను ADDతో బాధపడుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ సమస్య ఉన్న వారు ఎక్కువ సేపు ఒక్కే విషయంపై ఫోకస్ చేయలేరనీ, తరుచు ఆలోచన విధం మారుతోందని తెలిపారు. తన పెళ్లి రోజు మేకప్ ఆర్టిస్ట్‌ని రెండు గంటల పాటు మేకప్ చైర్‌పై కూర్చోవడానికి తనకు వీలు కాదని ముందే చెప్పేసానన్నారు. ADD కారణంగా అలియా ఎక్కువ సేపు ఒక్కే పనిపైనా దృష్టి పెట్టలేకపోయింది.
#AliaBhatt reveals that she has been clinically diagnosed with Anxiety & describes how #RanbirKapoor planned to reveal their world-their baby daughter #RahaKapoor to the whole world & how he patiently took care of her anxiety before the reveal. pic.twitter.com/6pGFVy2S5s
— Raymond. (@rayfilm) October 11, 2024
ADD అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. ఇది హైపర్యాక్టివిటీ, ఇంపల్సివిటీ ద్వారా గుర్తించబడిన న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏదైనా ఒక పనిపై నిరంతరం ఏకాగ్రత పెట్టే సామర్థ్యం లేకపోవడం. ADDతో బాధపడుతున్న వ్యక్తులు చాలా కాలం పాటు ఏదైనా ఒక పనిపై దృష్టి పెట్టలేరు. అలాంటి వారు ఏ పనినైనా త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా ADD పిల్లలలో సంభవిస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ సమస్య పెద్దవారిలో కూడా కనిపిస్తుందట.


Click it and Unblock the Notifications











