మహ్మద్ సిరాజ్‌తో డేటింగ్ .. అతనితో నా రిలేషన్ అదేనంటూ తేల్చేసిన హీరోయిన్
టీమిండియా క్రికెటర్లతో స్టార్ హీరోయిన్ల డేటింగ్, ప్రేమాయణం, ఎఫైర్ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో క్రికెటర్లు- బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమలో మునిగి తేలారు. వీరిలో కొన్ని పెళ్లి పీటల వరకు వెళ్లగా.. కొన్ని మధ్యలోనే ముగిసిపోయాయి. ఏ క్రికెటర్ అయినా ఏ హీరోయిన్‌తోనైనా కాస్త క్లోజ్‌గా ఉంటే చాలు వారి మధ్య లేనిపోనివి అంటగట్టేస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గురించి ఎక్కువగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ 2015లో రంజీ టోర్నమెంట్‌లతో క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో 2017లో విజయ్ హాజారే ట్రోఫీ, 2018లో ఇండియా ఏ జట్టు, 2019లో ఇండియా బీ జట్టులో స్థానం సంపాదించి తన ప్రదర్శనతో సెలక్టర్ల కళ్లలో పడ్డాడు. 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్ నాటి నుంచి నిలకడగా రాణిస్తూ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 36 టెస్టులలో 100 వికెట్లు, 44 వన్డేలలో 71 వికెట్లు తీశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ సిరాజ్ అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2017లో అతనిని 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్ అతనిని 12.25 కోట్లకు దక్కించుకుని సంచలనం సృష్టించింది. క్రికెట్‌కు అందించిన సేవలకు గాను మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీగా నియమించింది.
అందరు క్రికెటర్ల మాదిరిగానే సిరాజ్ విషయంలోనూ పలువురు హీరోయిన్లతో అతనికి ఎఫైర్లు కడుతూ ఎన్నోసార్లు రూమర్లు వైరల్ అయ్యాయి. కొద్దిరోజుల దిగ్గజ నేపథ్య గాయనీ ఆశా భోస్లే మనవరాలు , సింగర్ జనై భోస్లేతో సిరాజ్ డేటింగ్‌లో ఉన్నాడంటూ మీడియా కోడై కూసింది. ముంబైలో జరిగిన జనై పుట్టినరోజు వేడుకల్లో సిరాజ్ సందడి చేయడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఈ వార్తలపై సిరాజ్ , జనైలు స్పందించారు. జనై నాకు సోదరిలాంటిదని సిరాజ్.. మహ్మద్ సిరాజ్ తనకు సోదరుడని ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా మరో బాలీవుడ్ నటి మహిరా శర్మతో మహ్మద్ సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. గతంలో మహిరా చేసిన ఓ పోస్ట్‌కు సిరాజ్ లైక్ కొట్టడంతో పాటు ఆమెను ఇన్‌స్టాలో ఫాలో కావడం ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ రూమర్స్‌పై మహిరా శర్మ స్పందించారు. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని, అభిమానులు నటీనటులకు ఎవరితోనైనా సంబంధాలను పెట్టేస్తారని.. అలాంటి వాటిని తాను పట్టించుకోనని తెలిపారు. అటు హీరోయిన్ తల్లి సానియా శర్మ కూడా తన బిడ్డ సెలబ్రెటీ కావడం వల్లే ఇలాంటి పుకార్లు పుడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సో.. అదన్న మాట మేటర్.


Click it and Unblock the Notifications











