Nushrratt Bharuccha: రీల్ లైఫే రియల్ లైఫ్ గా మారింది, ఇజ్రాయెల్ లో చిక్కుకున్న నుష్రత్ బరుచా కథ ఇది!
Nushrratt Bharuccha: ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దారుణ యుద్ధంలో దాదాపు 500 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాల పాలయ్యారు. ఈ యుద్ధంతో రెండు దేశాల ప్రజలు గజగజా వణికిపోతుండగా.. బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా కూడా తెగ భయపడిపోతున్నారు. ఎందుకూ అంటారా.. ఆమె కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ లోనే ఉంది. పైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నుష్రత్ బరూచా ఇజ్రాయెల్ వెళ్లింది. అయితే అనుకోకుండా ప్రారంభమైన ఈ యుద్ధంతో అక్కడే చిక్కుకుపోయింది.
విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెకు ఫోన్ చేయగా.. స్పందించిన ఆమె ఓ బేస్ మెంట్ లో తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పింది. ఈ విషయం తెలుసుకొని ఊపిరి పీల్చున్నారు సన్నిహితులు. కానీ శనివారం రోజు మధ్యాహ్నం తర్వాత ఆమె ఫోన్ లేపకపోయేసరికి వారంతా తెగ కంగారు పడిపోయారు. ఈక్రమంలోనే రాయబార కార్యాలయం సాయంతో ఆమెను సంప్రదించారు. తాను సురక్షితంగా ఉన్నట్లు తెలుసుకున్నారు.

ఇజ్రాయెల్ నుంచి నేరుగా ఇండియాకు ఉన్న ఫ్లైట్ దొరకక పోవడంతో.. కనెక్టింగ్ ఫ్లైట్ లో ఆమె స్వదేశానికి రాబోతున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. ఆమె ఇండియాకు చేరుకోగానే అన్ని విషయాలు వెల్లడిస్తామని ఆమె స్నేహితులు, సన్నిహితులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం నుష్రత్.. భారత రాయబార కార్యాలయం సాయంతో ఎయిర్ పోర్టుకు చేరుకుందని సనాచారం. అంతకేకుండా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె భారత్ కు చేరుకుంటుందని తెలుస్తోంది.

నుష్రత్ బరుచా కిట్టీ పార్టీ అనే టీవీ సీరియల్ ద్వారా నటనా రంగంలో అడుగు పెట్టింది. 2006లో జై సంతోషీ మా అనే ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గ్యాప్ రావడంతో 2009లో మరో సినిమా చేసింది. ఇక ఆ తర్వాత అంటే 2010లో వచ్చిన తాజ్ మహల్ సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. కానీ ఈ ఒక్క సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్యార్ కా పంచనామా, సోనూ కే టిట్లు కీ స్వీటీ, డ్రీమ్ గర్ల్, రామ్ సేతు, ఛత్రపతి వంటి సినిమాలో నటించింది.

రీల్ లైఫే రియల్ లైఫ్ గా మారిన క్షణమిది : చివరగా నుష్రత్ అకేలి సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమాలో నుష్రత్ చేసిన క్యారెక్టర్ మాదిరిగానే ఇప్పుడు జరిగింది. అకేలి సినిమాలో ఇరాక్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఓ అమ్మాయి తీవ్ర గందరగోళం మధ్య ఇంటికి తిరిగి వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం నుష్రత్ నిజంగానే ఇజ్రాయెల్ లో చిక్కుకోవడంతో అంతా టెన్షన్ పడుతున్నారు. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదని త్వరలోనే ఆమె ఇండియాకు వస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన చోరీ - 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











