Sonam Kapoor: ఇండియా టు లండన్.. స్టార్ హీరోయిన్ కి రూ. 231 కోట్ల విల్లాను గిఫ్ట్ గా ఇచ్చిన మామ!
Sonam Kapoor: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.. ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె. తన తండ్రి వారసత్వంలో ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్‌గా అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా ఆకట్టుకుంది. పలు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన కెరీర్ లో నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుంది. ఈ అమ్మడు 2018 మేలో భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల కొడుకు. మ్యారేజ్ అయిన నాటి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ, పలు ఆసక్తికర విషయాలతో ఆమె వార్తల్లో నిలుస్తునే ఉంది. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ అంశమేంటీ?
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వెండితెరకు దూరంగా ఉన్నా వార్తల్లో నిలుస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ తన భర్త ఆనంద్ అహుజా, కొడుకుతో కలిసి లండన్ ను మకాం మార్చబోతుందట. ఇటీవల తన మామ, వ్యాపారవేత్త హరీష్ అహుజా లండన్‌లోని ఓ విశాలమైన విల్లాను కొనుగోలు చేసిందంట. ఈ లగ్జరీ భవనంలోనే ఆమె తన ఫ్యామిలీతో ఉండాలని భావిస్తున్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి.

లండన్ లోని అత్యంత విశాలమైన ఎనిమిది అంతస్తుల రెసిడెన్షియల్ కాన్వెంట్‌ను బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మామ హరీష్ అహుజా జూలైలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆనంద్ - కోడలు సోనమ్ ఉంటే ఈ విల్లాలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయట. ఈ విల్లాను సోనమ్ కపూర్ కు గిప్టుగా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ విల్లా విలువ తెలిస్తే.. దిమ్మతిరిగి బొమ్మకనిపిస్తోంది. నాటింగ్ హిల్‌లోని విలాసవంతమైన ఇల్లు కోసం 27 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. ఆ ఇంటి విలువ సుమారు రూ. 231.47 కోట్లు. ఈ బిల్డింగ్ దాదాపు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట. ఇది కెన్సింగ్టన్ గార్డెన్స్ నుండి కొంచెం దూరంలో ఉంది. లండన్‌లోని నాటింగ్ హిల్‌లో సమీపంలోని ఈ విల్లాకు సంబంధించిన పలు ఫోటోలను ఇటీవల సోషల్ మీడియాలో చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

ఇక సోనమ్ కఫూర్ మామ విషయానికి వస్తే.. హరీష్ అహుజా ఓ వ్యాపారవేత్త. ఆయన షాహీ ఎక్స్‌పోర్ట్స్ అనే టెక్స్ టైల్స్ బిజిసెన్ చేస్తారు.ఇది భారతదేశంలోని అతిపెద్ద వస్త్ర తయారీ కంపెనీలలో ఒకటి. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం.. షాహీ ఎక్స్‌పోర్ట్స్ 50 కంటే ఎక్కువ కంపెనీలను నడుపుతోంది. ఇందులో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉపాధి కల్పిస్తోంది. ఇక ఆనంద్ అహుజా షాహీ ఎక్స్‌పోర్ట్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తన సొంత రిటైల్ కంపెనీని కూడా నడుపుతున్నాడు.


Click it and Unblock the Notifications











